Home / క్రీడలు
ఆసియా ప్రపంచకప్-2022 ఫైనల్ పోరు నేడు రసవత్తరంగా సాగనుంది. ఆసియా కప్ కోసం శ్రీలంతో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆసిస్ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో ఓ గమ్మత్తు సన్నివేశం జరిగింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ మరియు కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ వన్డేలకు స్వస్తి పలుకనున్నారు. ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డేలో పాల్గొనిన అనంతరం ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు.
నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే పై మరొక వ్యక్తిని బలవంతం చేశాడనే ఆరోపణల పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిని సస్పెండ్ చేసింది. ఖాట్మండు పోలీస్ స్టేషన్లో లామిచానేపై ఫిర్యాదు నమోదయింది
ఆసియా కప్-2022లో విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. ఇండియా ఆఫ్గానిస్తాన్ కు మధ్య గురువారం జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొట్టి కొత్త రికార్డ్ సృష్టించారు. దీనికి గానూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కోహ్లీని ట్విట్టర్ వేదికగా అభినందించారు.
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇండియన్ స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో జరిగిన డైమండ్ ట్రోఫీ అథ్లెటిక్స్ లో విజేతగా నిలిచి డైమండ్ ట్రోఫీ గెలిచిలిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన విశ్వరూపం చూపించి, సెంచరీ చేసి కొత్త రికార్డ్ సృష్టించారు. చాలా రోజుల తరువాత బ్యాట్ పట్టుకున్న కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై చెలరేగి 61 బాల్స్ కు 122 పరుగులు (వీటిలో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ) చేసి నాటౌట్ గా నిలిచాడు.
బుధవారం అఫ్గాన్, పాక్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో చివరివరకూ సాగింది. మ్యాచ్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో పాక్‌కు 11 పరుగులు కావాలి. ఫజల్ హక్ ఫారూఖీ వేసిన తొలి బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన నసీమ్ షా సిక్సర్‌గా మలిచాడు.
శ్రీలంక పై టీమిండియా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టలు పెడుతున్నారు. టీమిండియా ఓటమిని క్రికెట్ అభిమానులు తీసుకోలేకపోతున్నారు. టీమిండియా ఆసియా కప్ ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి అలాగే సూపర్-4లో భాగంగా వరసగా రెండుసార్లు ఓడిపోయింది.
ఆసియా కప్పు టైటిలే ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు. అనుకోకుండా ఫైనల్ కు దూరమైయ్యింది. కాగా ఫైనల్స్ దూరమైనా తన పరాజయాన్ని చూపించకుండా లాస్ట్ మ్యాచ్ గెలవడంతోనైనా కొంత విజయ ఊరటను పొందాలని అనుకుంటుంది. నేడు టీంఇండియా ఆఫ్ఘాన్ తో తలపడనుంది.