Home / పొలిటికల్ వార్తలు
నేడు మంగళగిరిలో జనసేన పార్టీ పీఏసీ సమావేశం జరుగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షత జరిగే సమావేశంలో జనసేన పార్టీ చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ ప్రచారంపై సమీక్ష చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి కడపజిల్లాలోని సిద్దవటంలో ఆత్మహత్య చేసుకున్న 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున మొత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఉద్ధరిస్తున్నట్టు,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. అయితే పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆంక్షలు విధించారు.
జనసేనాని పవన్ కళ్యాన్ కడప జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పీఎసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మీడయాతో మాట్లాడుతూ ఏపీ సర్కార్ వైఖరిపై విరుచుకుపడ్డారు. కడపజిల్లాలో ఎవరూ ఊహించని విధంగా కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తిరుపతిలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జీఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు.
ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా ట్రబుల్ షూటర్ హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్‌కు భాద్యతలు అప్పజెప్పేవారు గులాబీ బాస్. అయితే మునుగోడు భాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?
మోదీ, ఈడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట తరచూ వినిపించే మాట. బలమైన నేతలు, ఎదురుతిరుగుతున్న నేతలను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ సర్కారు విచ్ఛలవిడిగా వాడుతోందన్న ఆరోపణలున్నాయి.
లేడీ అమితాబ్ విజయ శాంతి పాతికేళ్ల కిందటే బీజేపీలో చేరినా, ఇప్పటికీ పైకెదగలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలపలేకపోయారు. టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ సోదరిగా పిలిపించుకున్నా, అక్కడా కుదురుకోలేకపోయారు.
బావమరిది మంత్రిగా ఉన్నాడు. మంత్రి అంటే సమావేశాలు సాధారణమేకదా. అలాగే అతను కూడ ఈ సమావేశం నిర్వహించాడు. అయితే ఈ సమావేశానికి అతని బావ హాజరయ్యాడు. ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయిన అతడికి ఎటువంటి అధికారిక పదవి లేదు.
హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్‌కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.