Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. మే 13న పోలింగ్ సందర్బంగా పాల్వాయి గేటు వద్ద ఈవీఎం ను ధ్వంసం చేసిన పిన్నెల్లి అక్కడ ఉన్న టీడీపీ ఏజెంటును బెదిరించారు.
గొప్పవిజయానికి పిఠాపురం నుంచే బీజం పడిందని.. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరాన్ని సందర్శించిన పవన్.. అనంతరం వారాహి సభలో పాల్గొన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు.
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని ఇవాళ ప్రారంభించారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మిగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది.
వైసీపీని రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదేగతి పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు స్దానిక బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీసీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం.. సంప్రాదాయాలకు విరుద్ధం అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్ఎంసి) రోనాల్డ్ రోస్తో సహా తెలంగాణలోని పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. గత కొద్ది రోజులకిందట పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఆపుడు ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం.