Home / పొలిటికల్ వార్తలు
వైసీపీని రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదేగతి పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు స్దానిక బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీసీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం.. సంప్రాదాయాలకు విరుద్ధం అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్ఎంసి) రోనాల్డ్ రోస్తో సహా తెలంగాణలోని పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. గత కొద్ది రోజులకిందట పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఆపుడు ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో విపక్ష మహిళా నేతలే టార్గెట్‌గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చోపెట్టారు. 16వ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు.
రుషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ భవనాల్లో, గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు
కాపు ఉద్యమ నేత, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.తాను నిర్వర్తించబోయే శాఖలు.. తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.