Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణలో సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు.
రాజ్ భవన్ - ప్రగతి భవన్ ల మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెరాస ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ధర్మాసనం మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దనింది.
మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్‌ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఛాన్సలర్ స్థానంలో నిపుణుడిని తీసుకురావాలని ఆలోచిస్తోంది.
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని 'బర్తరఫ్' చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసిందని డీఎంకే తెలిపింది. నవంబర్ 2న అందజేసిన ఈ వినతిపత్రంలోపెండింగ్‌లో ఉన్న నీట్ బిల్లుతో సహా గవర్నర్‌కు సంబంధించిన అనేక సమస్యలను తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు అంటూ సాగిన ఈ వీడియోలో పవన్ ఇలా అన్నారు.
భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకొనింది. 62వ రోజు పాదయాత్ర లో భాగంగా నాందేడ్ జిల్లా అట్కాలి గ్రామంలో జోడో యాత్ర సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సేవాదళ్ నేత కృష్ణ కుమార్ పాండే పాదయాత్రలో కుప్పకూలి మరణించారు.