Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.
రూ.200 కోట్ల కుంభకోణంలో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాసాడు.
ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు అందరూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుల భారీ నుండి కాపాడడం ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు కనపడతాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపటిదినం ప్రధాని రామగుండం రానున్న క్రమంలో కిషన్ రెడ్డి భాజపా కార్యాలయంలో మీడియాతో సమావేశమైనారు.
వైకాపా పాలనలో ప్రజలు పడుతున్న బాధలు ఓవైపు, మరో వైపు సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 365రోజుల పాదయాత్రకు రంగం సిద్ధమైంది