Home / పొలిటికల్ వార్తలు
తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులుపై దాడి జరిగింది. నగరంలోని ఆయన ఇంటి సమీపంలో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు శ్రీనివాసులును కారుతో ఢీ కొట్టాడు.
అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాగా తాను ముస్లిం టోపీ ధరించడంపై మాజీ మంత్రి వివరణ ఇచ్చారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ 'సంకల్ప్ పత్ర' లేదా 'మేనిఫెస్టో'ని విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తుని కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైయ్యింది. ఏపీలో ఉనికి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ని నియమించింది అధిష్టానం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిడుగు రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆధారాలు మాయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాజకీయాలు అంటే ఒక జవాబుదారీతనం ఉండాలి. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేస్తేనే.. ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారు.. లేకుంటే అధికారంలో నుంచి పోవాలనే మేసేజ్ పోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా ప్రమాదకరమని, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.