Home / పొలిటికల్ వార్తలు
వైసీపీ ప్రభుత్వం తనకు ఇద్దరు గన్ మెన్లను తొలగించిన నేపధ్యంలో మిగిలిన ఇద్దరు గన్ మెన్లనుకూడ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
CM KCR: తాము అధికారంలోకి వస్తే.. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ అన్నారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక ప్రకటనలు చేశారు. భారాస అధికారంలోకి వస్తే.. రైతు బంధు, 24 గంటల విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.
CM KCR: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకు అనుగుణంగానే నిర్వహించిన తొలి సభ సక్సెసైంది. ఈ సభలో మాట్లాడిన దేశాభివృద్దే లక్ష్యంగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.
Ts Cabinet Meeting: రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆధ్యక్షతన..ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. శాసన సభలో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సారి సుమారు.. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. కేబినేట్ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ నాందేడ్ వెళ్లారు.
ఏపీలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకొని వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జనసేన బరిలోకి దిగుతుంది. అందులో భాగంగానే మన్యం జిల్లా.. పాలకొండ నియోజకవర్గం .. భామిని మండలంలో జనసేన ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు క్యాలెండర్ లు పంపిణీ చేశారు.
తెలుగు దేశం పార్టీ పై వైఎస్సీర్సీపీ నేత లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హామీలు ఇస్తారు కానీ అమలు చేయరని ఓవైసీ అన్నారు.
Akhila Priya: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పెంచాయి. బహిరంగ కు చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్యే శిల్పా రవికి భూమ అఖిల ప్రియ సవాల్ విసిరారు. దీంతో అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది.
క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ లను కోరారు.
Ts Assembly: నేడు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత.. సభను వాయిదా వేశారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ముందు.. ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.