Home / పొలిటికల్ వార్తలు
జనసేన అధినేత గేర్ మార్చి సినిమాలు, రాజకీయాలలో స్పీడ్ పెంచారని తెలుస్తుంది. ఒకవైపు వరుస సినిమాలు స్టార్ట్ చేస్తూ దూకుడు పెంచిన పవన్ మరో వైపు రాజకీయాలలో కూడా అధికార పార్టీ నేతలపై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేసి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాధ్ పై ఫైర్ అయ్యారు
Nirmala Seetharaman:కేంద్ర బడ్జెట్ సందర్భంగా.. పార్లమెంట్ లో కాసేపు నవ్వులు విరబూశాయి. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్ధిక మంత్రి సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు. పొరపాటున నోరు జారడంతో.. ఒక్కసారిగా లోక్‌సభలో నవ్వులు విరిశాయి.
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. తాజాగా నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా ఎమ్మెల్యే.. ఒక బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై 87 కోట్ల విలువైన ఆస్తుల్ని వేలంపాటలే బిడ్డర్లను భయపెట్టి 11 కోట్లకే సొంతం చేసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది.
అధికార పార్టీ వైసీపీలో సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ గురించి సొంత పార్టీ నేతలే చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం సద్దుమణగడంతో.. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయసభలను ఉద్దేశించి.. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ ప్రసంగం చేయనున్నారు.
President: రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము.. తొలిసారిగా తన ప్రసంగాన్ని పార్లమెంట్ లో వినిపించారు. పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దీంతో ద్రౌపది ముర్ము.. తన తొలి ప్రసంగాన్ని పార్లమెంట్ సాక్షిగా వినిపించారు.
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.