Home / జాతీయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సోమవారం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలిక పాక్షిక అర్దనగ్నంగా రక్తస్రావంతో ఇంటింటికి తిరిగి సహాయం కోసం వేడుకుంటే ఒక్కరు కూడా కనికిరించలేదు. సహాయం కోసం ఒక వ్యక్తిని అభ్యర్దిస్తే అతడు తరిమికొట్టాడు.
పంజాబ్‌లోని మోగాకు చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి కి ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని కడుపులోనుంచి తీసిన వస్తువుల జాబితాలో ఇయర్ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు వంటి వస్తువులు ఉన్నాయి. మానసికంగా అస్వస్థతకు గురయిన ఈ వ్యక్తి తీవ్రమైన దీర్ఘకాలిక కడుపునొప్పితో వైద్యులను సంప్రదించడం జరిగింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ)ని నమోదు చేసింది. అక్టోబర్ 3లోగా అన్ని పత్రాలను అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను సీబీఐ ఆదేశించింది.
మణిపూర్ ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) అక్టోబర్ 1 నుండి 6 నెలల పాటు పొడిగించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, లోయలోని 19 పోలీసు స్టేషన్లు మినహాయించబడ్డాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైన్స్ సిటీలో రోబో ఎగ్జిబిషన్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఎగ్జిబిషన్‌లోని వివిధ రోబోట్ స్టాల్స్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి అనేక రోబోలను గమనిస్తున్నప్పుడు ప్రధాన మంత్రి X లో ఒక ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసారు.
కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుచ్చిలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కావేరీ జలాల వివాదంపై రైతులు తమ నిరసనకు గుర్తుగా నోటివద్ద చనిపోయిన ఎలుకలు పెట్టుకున్నారు.
కాన్పూర్‌లో ఒక మహిళ తన స్నేహితురాలితో సెక్స్ లో పాల్గొనడానికి నిరాకరించడంతో బాయ్ ప్రెండ్ ప్రైవేట్ భాగాలను నరికివేసింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కాన్పూర్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సంజయ్ పాండే తెలిపారు.ఈ సంఘటన చౌబేపూర్ పోలీస్ సర్కిల్లోని ఒక గ్రామంలో జరిగింది.
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వహీదా 1972లో పద్మశ్రీ, 2011 లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
మణిపూర్ లో జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు ఒక ప్రదేశంలో కూర్చున్నట్లు చూపించారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడుకు కావేరీ నదీజలాల విడుదలకు నిరసనగా మంగళవారం కన్నడ రైతు సంఘాలు మరియు కన్నడ సంస్థలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు బీజేపీ మరియు జెడి(ఎస్) మద్దతు ప్రకటించాయి.