Home / జాతీయం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా వరుసగా నాలుగో సంవత్సరం అగ్రస్థానంలో నిలిపింది. విద్యా మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2021 ప్రకారం ఐఐటి మద్రాస్ "మొత్తం" "ఇంజనీరింగ్" విభాగాల్లో ముందుంది. ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లు
కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ ను నేడు భారతదేశంలో మరియు విదేశాల్లోని 510 నగరాల్లోని పరీక్షా కేంద్రాలలో శుక్రవారం నిర్వహిస్తున్నారు 14.9 లక్షల రిజిస్ట్రేషన్లతో, అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు ఇది ఉమ్మడి పరీక్ష. ఇది జేఈఈ -మెయిన్ యొక్క సగటు నమోదు తొమ్మిది లక్షలను అధిగమించి దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రవేశ పరీక్ష
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారం, జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తినటం, పిల్లల్ని కనడం అడవిలో జంతువులు కూడా చేస్తాయన్నారు. కానీ ఇది సభ్య సమాజంలో నివసించే మనుష్యులకు వర్తించదని అన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.
అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విలువ ఆధారిత పన్నువ్యాట్ (లీటరుకు వరుసగా రూ.5 మరియు రూ.3 తగ్గించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడనుంది. ఇంధన ధరల పెంపుతో నష్టపోయిన సామాన్యులకు ఇది మేలు చేస్తుందని
ఇటీవల విదేశాల నుండి కేరళ కు తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ లక్షణాలను ఉండటంతో ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుందని ఆమె తెలిపారు. ఆ వ్యక్తికి వైరస్ లక్షణాలు కనిపించాయని, విదేశాల్లో ఉన్న మంకీపాక్స్ రోగితో సన్నిహితంగా ఉన్నారని జార్జ్ చెప్పారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపధ్యంలో ఉభయ సభల్లో ఉపయోగించకూడని పదాల జాబితాను విడుదల చేసారు. పార్లమెంట్ లో ఇకపై జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ వ్యాప్తి' మరియు 'స్నూప్‌గేట్' వంటి పదాలను ఉపయోగించడం మరియు 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి' వంటి పదాలను ఉపయోగించకూడదు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు.
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు గత ఏడాదితో పోల్చితే జూలై 7 నాటికి 15 శాతం తగ్గింది. మొత్తంగా, రైతులు 6.3 మిలియన్ హెక్టార్ల (Ha) పొలాల్లో విత్తలేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ (CMIE) మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ జూన్‌లో తగ్గిన సాగు విస్తీర్ణం వ్యవసాయరంగంలో ఉపాధిని దెబ్బతీసిందని చెప్నారు.
ఏఐఏడీఎంకే నుంచి ఓ పన్నీర్‌సెల్వం ను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం చెల్లదని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. ఇది కేవలం స్వార్దప్రయోజనాలకోసం సమావేశమయిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని శశికళ అన్నారు.