Last Updated:

Giriraj Singh: బీహార్ లో మద్యం దేవుడిలాంటిది.. కనిపించదుకాని అన్నిచోట్లా ఉంటుంది.. బీజేపీ నేత గిరిరాజ్ సింగ్

బీహార్‌లో మద్యం వినియోగం దేవుడిలాంటిదని, అది కనిపించదని, సర్వత్రా ఉందని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ అన్నారు.

Giriraj Singh: బీహార్ లో మద్యం దేవుడిలాంటిది.. కనిపించదుకాని అన్నిచోట్లా ఉంటుంది.. బీజేపీ నేత  గిరిరాజ్ సింగ్

Bihar: బీహార్‌లో మద్యం వినియోగం దేవుడిలాంటిదని, అది కనిపించదని, సర్వత్రా ఉందని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ అన్నారు. దేవుడు సర్యాంతర్యామి కాని ఎక్కడా కనిపించడు. బీహార్ లో లిక్కర్ కూడ అలాగే ఉందని ఆయన అన్నారు.

నితీష్ కుమార్ ఆత్మపరిశీలన చేసుకోవాలి.తన సొంత ప్రజలు తనపై ఎందుకు నమ్మకం కోల్పోతున్నారో విశ్లేషించుకోవాలి. బీహార్‌లో విషపూరితమైన మద్యం తాగడం వల్ల ప్రజలు చనిపోని రోజు లేదా నెల లేదు కాబట్టి అతను బీహార్‌లో మద్యం విధానాలపై పునరాలోచించాలి అని గిరిరాజ్ సింగ్ అన్నారు. శనివారం, బీహార్‌లోని వైశాలి జిల్లాలో కనీసం ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి మరణించారు. బీహార్ లో 2016 నుండి మద్యపాన నిషేధం అమల్లో ఉంది.

మరోవైపు రాష్ట్రీయజనతాదళ్ ఎమ్మెల్సీ చంద్రవంశీ కూడా అదే పోలికను ఉదహరించారు. బీహార్‌లో, మద్యం దేవుడు లాంటిది, ఇది ఎక్కడా కనిపించదు, కానీ ప్రతిచోటా లభిస్తుందన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రసంగించిన ర్యాలీలో ఖాళీ మద్యం సీసాలు లభించడంపై ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. గురువారం తెల్లవారుజామున, పాలిగంజ్‌లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో మద్యం పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఐదుగురు ఖైదీలు మరియు ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి: