Last Updated:

Jagan and Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి పలువురు నేతలకు ప్రధాని ఆహ్వానం లభిచిందింది.

Jagan and Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?

Jagan and Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి పలువురు నేతలకు ప్రధాని ఆహ్వానం లభిచిందింది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగబోతోంది.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కాగా ఇప్పటికే చంద్రబాబు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు.

ఇదిలా ఉంటే సమావేశం ముగిసిన వెంటనే జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గాలో పెద్ద ఉర్సు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరుకానున్నారు.

ఇదీ చదవండి: అదృశ్యమైన ఎమ్మెల్యే.. అడవిలో ప్రత్యక్షం.. ఏం చెప్పారంటే..?

ఇవి కూడా చదవండి: