Home / జాతీయం
ఇటీవల కాలంలో తరచుగా విమానాలలో మూత్రవిసర్జన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ట్రైన్ లో టీటీఈ మద్యం మత్తులో మహిళా ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమృత్సర్-కోల్‌కతా అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన జరిగింది.
దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అదానీ చిన్నకొడుకు జీత్ అదానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి మహిళగా నిలిచారు.సోమవారం ముంబైలోని షోలాపూర్ స్టేషన్ మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య సెమీ-హై స్పీడ్ రైలును ఆమె నడిపారు
గుజరాత్లో 58 ఏళ్ల మహిళ H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ బారిన పడి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె వడోదరలోని ఎస్ఎస్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.దీనితో భారత్‌లో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రి అంతా గర్వంగా విశ్వ వేదికపై తలెత్తుకునేలా చేశాయి మన చిత్రాలు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాట పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ వేదిక దద్దరిల్లిన విషయం తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.
కరుణానిధి మనవడుగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు ఉదయనిధి స్టాలిన్. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, హీరోగా తమిళ ప్రజలకు దగ్గరయ్యాడు. ఈయన సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్ ఉంటుంది. అయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగాడు. డీఎంకే పార్టీ యూత్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం
పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 17 లక్షల మందికి పైగా మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నేటి (మార్చి 14) నుండి తమ నిరవధిక సమ్మెను ప్రారంభించారు. నివేదికల ప్రకారం, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు సమ్మె కొనసాగుతుందని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చెప్పింది
1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యుసిసి) నుండి అదనపు పరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్రం చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం జమ్మూ మరియు కాశ్మీర్ అంతటా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఉగ్రవాద దాడులు మరియు మైనారిటీలు మరియు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని హత్యలకు సంబంధించి గత ఏడాది దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి ఎనిమిది ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయి.
ఎల్ఐసీ నుంచి అదానీ గ్రూప్ లోని ఏయో సంస్థలు ఎంత రుణాలు తీసుకున్నాయనే వివరాలు కూడా మంత్రి తెలిపారు.