Last Updated:

Manipur DGP: మణిపూర్ డీజీపీగా రాజీవ్ సింగ్‌ను నియమించిన కేంద్రం

మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో త్రిపుర కేడర్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి రాజీవ్ సింగ్ మణిపూర్ కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులయ్యారు

Manipur DGP: మణిపూర్ డీజీపీగా రాజీవ్ సింగ్‌ను  నియమించిన కేంద్రం

Manipur DGP:మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో త్రిపుర కేడర్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి రాజీవ్ సింగ్ మణిపూర్ కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులయ్యారు.గతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్ ) ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న సింగ్, మే 29న కేంద్రం నుండి మణిపూర్‌కు డిప్యుటేషన్‌పై పంపబడ్డారు. ప్రస్తుత డీజీపీ డౌంగెల్ హోం శాఖకు బదిలీ చేయబడ్డారు.

శాంతికమిటీ ఏర్పాటు.. (Manipur DGP)

మే 3న రాష్ట్రంలో హింస చెలరేగిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్‌ను మణిపూర్ ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా నియమించింది.ఘర్షణలపై జ్యుడీషియల్ విచారణ మరియు కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో డీజీపీ మార్పు జరిగింది. విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా హింసను అంతం చేయడానికి సంభాషణలే కీలకమని నొక్కి చెప్పారు.శాంతి కమిటీ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, కుకీ మరియు మెయిటీ కమ్యూనిటీలు మరియు సామాజిక సంస్థల ప్రతినిధులు ఉంటారు.

మణిపూర్‌లో జరిగిన హింసాకాండ వెనుక ఐదు నేరపూరిత కుట్రలు మరియు ఒక సాధారణ కుట్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు ప్రణాళికలను కూడా హోం మంత్రి వెల్లడించారు. రిస్థితి త్వరలో సాధారణ స్దితికి వస్తుందని ఆయన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.