Home / జాతీయం
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని తీసుకున్న విపక్షాల నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విరుచుకుపడ్డారు.జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాలో మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని గురువారం ఢిల్లీ చేరుకున్నారు.
కర్నాటక ఎన్నికల ముందు అమూల్ వర్సెస్ నందిని వివాదరం రేగిన కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ పాల సమాఖ్య నుంచి అమూల్ పాలను సేకరించకుండా ఆపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ గురువారం దేశ రాజధానిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేరారు.తీహార్ జైలు వాష్‌రూమ్‌లో జైన్ కిందపడిపోయాడని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు తెలిపాయి.ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రిని ఆసుపత్రికి తరలించడం గత వారంలో ఇది రెండోసారి.
:ఢిల్లీ (ఆనంద్ విహార్)-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లో ప్రవేశపెట్టిన తొలి వందే భారత్ రైలు ఇది కావడం విశేషం.
రైల్వే నెట్‌వర్క్‌ను పెంపొందించడానికి భారతదేశం బహుమతిగా ఇచ్చిన 20 బ్రాడ్ గేజ్ రైల్వే లోకోమోటివ్‌లు మంగళవారం సాయంత్రం బెంగాల్ సరిహద్దు గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించాయి.నదియాలోని గెడే స్టేషన్ సమీపంలో పార్క్ చేయబడిన, లోకోలు సాయంత్రం ఢిల్లీ నుండి బయలు దేరాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాంచీలో సుమారు రూ550 కోట్లతో నిర్మించిన జార్ఖండ్ హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభించారు. సుమారుగా 165 ఎకరాలల్లో ఉన్న కొత్త హైకోర్టు విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్దది.
: ఆమ్నెస్టీ ఇండియా నిషేధాన్ని రద్దు చేయాలని కోరడంతో విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని పరిశీలిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో గంజాయి నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని ఒడిశా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలోని ఏ శివాలయంలోనూ గంజాయిని ఏ రూపంలోనూ ఉపయోగించరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ బుధవారం నిర్దోషిగా విడుదలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై గతేడాది అక్టోబర్‌లో ఇదే కేసులో ఆయన దోషిగా తేలింది.
కోల్‌కతాకు చెందిన ఒక లెస్బియన్ జంట సోమవారం సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. హల్దీ, సంగీత్, మెహందీ మరియు ఫెరాస్తో సహా అన్ని సాంప్రదాయ బెంగాలీ ఆచారాలతో వీరి వివాహం జరిగింది.