Published On:

ఆసుపత్రిలో అమానవీయం.. వృద్ధుడిని కొట్టి ఈడ్చుకెళ్లిన వైద్యుడు.. వీడియో వైరల్‌తో చర్యలు

ఆసుపత్రిలో అమానవీయం.. వృద్ధుడిని కొట్టి ఈడ్చుకెళ్లిన వైద్యుడు.. వీడియో వైరల్‌తో చర్యలు

Doctor Thrashed Elderly Man : మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్య వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీంతో వైద్యుడు రాజేశ్ మిశ్రా అతడిని కొట్టి, బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

చెంపదెబ్బ కొట్టిన డాక్టర్..
నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్యకు వైద్యం కోసం ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఆ క్రమంలో టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలాసేపు లైన్‌లో నిలబడినట్లు చెప్పాడు. తన వంతు వచ్చినప్పుడు వైద్యుడు రాజేశ్ మిశ్రా అభ్యంతరం చెప్పి చెంపదెబ్బ కొట్టి తన్నాడని ఆరోపించారు. కానీ, వీడియోలో ఇద్దరు వ్యక్తులు జోషిని కొడుతూ ఆసుపత్రి నుంచి బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి ఉద్ధవ్ సింగ్ జోషిని కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఆసుపత్రి సిబ్బంది వాదన..
ఉద్ధవ్ సింగ్ జోషి ఆరోపణలను ఆసుపత్రి సిబ్బంది ఖండించారు. సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వార్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఆ రోజు పెద్ద సంఖ్యలో రోగులు వచ్చారని తెలిపారు. ఆ క్రమంలో జోషి లైన్ దాటి ముందుకు వచ్చారని అందుకే వైద్యుడు మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. వీడియో ఆధారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని మరికొంత మంది చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది.

 

రాజకీయ దుమారం..
ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మోహన్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బదులు హింసలు జరుగుతున్నా అభివృద్ధి మోడల్ ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పాలకులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై పోలీసులు సైతం స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతుండగా, వైద్యుడు జోషిపై ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు.

 

 

ఇవి కూడా చదవండి: