Nehal Modi: అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడి అరెస్టు

Nirav Modi Brother Arrested: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడిని అరెస్టు చేశారు. ఇవాళ నేహల్ మోదీని అమెరికాలో బంధించారు. సీబీఐ, సీడీ సమర్పించిన అప్పగింత అభ్యర్థన ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్‌ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదైంది.
మల్టీ లేయర్ స్కీం రూపంలో సుమారు రూ.19 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కంపెనీ నుంచి తప్పుడు కారణాలతో డైమెండ్లను తీసుకున్నాడని, కానీ, డీల్ ఎప్పటికీ జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. పేమెంట్ ఒప్పందాలను నేహల్ ఉల్లంఘించాడు. కానీ, డైమెండ్లను తన సొంత లబ్ధి కోసం అమ్మినట్లు తెలుస్తోంది.