Home / తప్పక చదవాలి
రాయల్ ఎన్ఫీల్డ్ మంగళవారం తన హంటర్ 350 మోటార్‌సైకిల్ 200,000 యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయని తెలపింది. ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. హంటర్ ఆగస్ట్ 2022లో లాంచ్ అయింది. ఫిబ్రవరి 2023లో 100,000-సేల్స్ మార్క్‌ను తాకింది. రిటైల్ ప్రారంభమైన ఆరు నెలలకే. ఇది ఐదు నెలల్లో తదుపరి 100,000-అమ్మకాల మైలురాయిని పూర్తి చేసింది.
20 ఏళ్లలో తొలిసారిగా, సింగపూర్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన మహిళకు మరణశిక్ష విధించబోతున్నారని, ఉరిశిక్షలను నిలిపివేయాలని స్థానిక మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.50 గ్రాముల (1.76 ఔన్సుల) హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడిన 56 ఏళ్ల వ్యక్తిని బుధవారం ఆగ్నేయాసియా నగర-రాష్ట్ర చాంగి జైలులో ఉరితీయబోతున్నట్లు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ (TJC) తెలిపింది.
పాకిస్తాన్‌లోని తన ఫేస్ బుక్ ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి వెళ్లిన భారతీయ మహిళ అంజు ఇస్లాం మతంలోకి మారి అతడిని వివాహం చేసుకుంది.ఆమె మతం మారిన తరువాత ఫాతిమా అనే పేరు పెట్టుకుంది.
విశాఖ పట్టణం ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి కేసులో ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని గతంలో సిఎం వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని ఇప్పుడు ఎన్ఐఎ కోర్టు కొట్టేసింది.
ఇండియాలో MBBS పూర్తయిన వెంటనే లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ తీసుకున్న తరువాత ఆసక్తి ఉన్న వారు ఇతర దేశాల్లో మెడిసిన్ లో పీజీ చేయవచ్చు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం పొందిన కాలేజీలు 390 వరకూ ఉన్నాయి. ఈ కాలేజీల్లో మెడిసిన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు విదేశాల్లో పీజీ చేయడానికి అర్హులు
ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు ఆదివారం (జూలై 23) గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.
మణిపూర్‌పై కొనసాగుతున్న పార్లమెంటు ప్రతిష్టంభన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విపక్ష కూటమి ఇండియాపై తీవ్రమైన విమర్శలను గుప్పించారు. దేశం పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించలేమని అన్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ విపక్షాలు నిరాశ మరియు నిరుత్సాహానికి గురయ్యాయని అన్నారు.
మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాను ఢిల్లీ కోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది.ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం మరియు ఫోర్జరీ వంటి అన్ని ఆరోపణల నుండి గోపాల్ కందా మరియు అతని సహచరురాలు అరుణా చద్దాను ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ నిర్దోషులుగా ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
అల్జీరియాలో చెలరేగుతున్న కార్చిచ్చులో 25 మంది మరణించారు. వీరిలో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. వీరు అధిక గాలులు మరియు వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తెలిపాయి. మరో 25 మంది గాయపడ్డారు.