Home / తప్పక చదవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా గెలిచారు. అయితే జలగం వెంకట్రావు రెండో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే వనమా సమర్పించిన అఫిడవిట్లో తేడాలున్నాయంటూ జలగం వెంకట్రావు హైకోర్టుని ఆశ్రయించారు
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌తో పాటు.. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు మెల్లిమెల్లిగా ముందుకుసాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్.. సంస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అన్నిస్థాయిలో ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ట్విట్టర్‌కు మారు పేరుగా నిలిచిన నీలం రంగు పక్షి లోగో స్థానంలో తాజాగా 'X'(ఎక్స్)ను చేర్చారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రతిసారీ చెట్లని కొట్టివేస్తుండటంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లీ సుభాష్ మధ్యన నడుస్తున్న వివాదం తాడేపల్లికి చేరింది. దీంతో వచ్చి కలవాలంటూ అధిష్టానంనుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకి ఆదేశాలు అందాయి. తాడేపల్లికి చేరుకున్న తోట త్రిమూర్తులు రామచంద్రపురం వివాదంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు.
మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం మళ్లీ వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో గందరగోళం కొనసాగుతుండగా, ప్రతిపక్షాలు ప్రధానమంత్రి సభ వెలుపల ఎందుకు మాట్లాడుతున్నారు కాని లోపల ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి.
రాజస్దాన్ మంత్రివర్గం నుంచి తొలగించబడిన మంత్రి రాజేంద్ర సింగ్ గూడా సోమవారం రాజస్థాన్ అసెంబ్లీ లో 'రెడ్ డైరీ'తో కలకలం సృష్టించారు.అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 నుండి 500 కోట్ల వరకు చేసిన అక్రమ లావాదేవీల రికార్డులు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ దాడుల్లో ఉన్న మంత్రి ధర్మేంద్ర రాథోడ్ ప్రాంగణంలో ఉన్న 'రెడ్ డైరీ'ని వెలికితీసేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను పలుమార్లు సంప్రదించారని గుధా సంచలన వ్యాఖ్యలు చేసారు.
న్యూఢిల్లీకి చెందిన ఒక వివాహిత తన ప్రేమికుడిని కలవడానికి పాకిస్థాన్‌కు వెళ్లింది. అయితే, ఎలాంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి చొరబడిన సీమా హైదర్‌లా కాకుండా, వీసాపై అధికారులు అంజుకి పాకిస్తాన్లోకి ప్రవేశం కల్పించారు.ఆమె వాఘా మార్గంలో పాకిస్తాన్ చేరుకుని అక్కడనుంచి ఇస్లామాబాద్ కు చేరుకుందని ఆజ్ న్యూస్ నివేదించింది
చైనాలోని క్వికిహార్ నగరంలో ఆదివారం పాఠశాల వ్యాయామశాల కాంక్రీట్ పైకప్పు కూలి 10 మంది మృతి చెందగా, ఒకరు చిక్కుకుపోయారు. 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని భావించారు. అధికారులు 14 మంది వ్యక్తులను శిథిలాల నుండి బయటకు తీశారు.
క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ఒపెన్‌హైమర్'లో నటుడు సిలియన్ మర్ఫీ పోషించిన టైటిల్ పాత్ర, పవిత్ర హిందూ గ్రంథమైన భగవద్గీత నుండి శ్లోకాలను పఠిస్తూ సెక్స్ లో పాల్గొనే సన్నివేశంపై వివాదాలు చుట్టుముట్టాయి.