Home / తప్పక చదవాలి
: రెండు 'ఉక్రెయిన్' డ్రోన్లు భవనాలను ఢీకొట్టడంతో ఆదివారం రష్యా రాజధాని మాస్కోలోని Vnukovo అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయబడింది. రాత్రి సమయంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి రెండు ఆఫీస్ బ్లాకులను దెబ్బతీసిన తరువాత విమానాశ్రయం మూసివేయబడింది.రాజధాని యొక్క Vnukovo విమానాశ్రయం బయలుదేరే మరియు రాకపోకల కోసం మూసివేయబడింది. విమానాలు ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించబడ్డాయి.
దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న మణిపూర్ జాతి సంఘర్షణను సత్వరమే పరిష్కరించకపోతే, అది దేశానికి భద్రతా సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం చెప్పింది. ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీల బృందం ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేని రాజ్‌భవన్‌లో కలిసి తమ పరిశీలనలపై మెమొరాండం సమర్పించింది.
మణిపూర్ లో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుండి వచ్చి నివసిస్తున్న అక్రమ వలసదారుల బయోమెట్రిక్ డేటాను సేకరించడం ప్రారంభించింది. మణిపూర్‌లో జాతి ఘర్షణలు మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారి ప్రమేయంతో పాటు, నార్కోటెర్రరిజంతో ముడిపడి ఉన్నాయి.
డీఎంకేను వంశపారంపర్య పార్టీగా అభివర్ణించిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉంధయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా తన కుమారుడు జై షా స్దానాన్ని ఆయన ప్రశ్నించారు.
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఒక సైనికుడు మాయమయ్యాడు. జమ్మూ మరియు కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన రైఫిల్‌మ్యాన్ జావేద్ అహ్మద్ ఈద్ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చాడు. అతను తిరిగి వచ్చి రేపు డ్యూటీలో చేరాల్సి ఉంది.
హైదరాబాద్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దిల్ రాజ్, సి.కళ్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ జరగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఫిలిం ఛాంబర్ లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా… 900 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు తెలుగు సినీ నటుడు బ్రహ్మానందం తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. బ్రహ్మానందం కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి కార్డును ఆయన సతీమణి శోభతో కలిసి ముఖ్యమంత్రి స్వీకరించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C 56 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించారు. ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం.
ఇంతకాలం బీజేపీలో ఉన్నా పురంధేశ్వరిని పెద్దగా పట్టించుకోని వైఎస్ఆర్సిపి నేతలు ఆమె అధ్యక్షురాలైన తరువాత వరుసగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంతకాలం ఆమె పట్ల కాస్త మర్యాదగా మాట్లాడిన ఫ్యాను పార్టీ నేతలు ఇప్పుడు డోసు పెంచారు. ఇటీవలి కాలంలో ఏపీలోని ముఖ్య పట్టణాలకి వెళుతూ మీడియా సమావేశాల్లో పురంధేశ్వరి వైఎస్ఆర్సిపిపై విరుచుకు పడుతున్నారు. అంతే ఘాటుగా వైఎస్ఆర్ మంత్రులు స్పందిస్తున్నారు.
తమిళనాడులోని కృష్ణగిరిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడు కారణంగా సమీపంలోని ఓ హోటల్ భవనం కూలిపోగా, మరో నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతినడంతో పలువురు చిక్కుకుపోయారు.పాతాయపేట లో ఉన్న ఈ బాణాసంచా తయారీ గోడౌన్లో తీవ్రంగా గాయపడిన 12 మందిని ఇప్పటివరకు ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.