Home / తప్పక చదవాలి
మయన్మార్ యొక్క జాతీయ రక్షణ మరియు భద్రతా మండలి సోమవారం దేశంలో అత్యవసర పరిస్థితిని ఆరు నెలలు పొడిగించడానికి అంగీకరించింది, జుంటా ఆగస్టు నాటికి నిర్వహించాలని భావించిన ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మీడియా తెలిపింది.
మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించే వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో బాధిత మహిళల పిటిషన్ ను విచారించినభారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. మే 4న ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని, 14 రోజుల పాటు పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.
జ్ఞాన్వాపి మసీదు అంశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, జ్ఞాన్వాపి సముదాయాన్ని మసీదుగా పిలవలేమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం యోగి మాట్లాడుతూ ముస్లిం పక్షం చారిత్రక తప్పిదాన్ని అంగీకరించి పరిష్కారాన్ని ప్రతిపాదించాలని అన్నారు.
మణిపూర్ లైంగిక వేధింపుల వీడియోలో కనిపించిన ఇద్దరు మహిళలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారి పిటిషన్‌ను నేడు విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు సుమారు 21 లక్షల రూపాయల విలువైన టమోటాలను తరలిస్తున్న ట్రక్కు అదృశ్యమైనట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. కోలార్‌కు చెందిన మెహత్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంలోని ట్రక్ జూలై 27న బయలుదేరింది. కాని ఇప్పటివరకు చేరుకోలేదు.
తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్‌లో 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.
జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్ కాల్చిచంపాడు. బాధితుల్లో ముగ్గురు ప్రయాణికులు, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) ఉన్నారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ నలుగురిని కాల్చిచంపాడు. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాపి-బొరివలి స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో సి కళ్యాణ్ ప్యానెల్‌పై దిల్ రాజు ప్యానెల్ హవా కొనసాగుతోంది. నిర్మాతల రంగంలోని మొత్తం 12 సీట్లలో ఇప్పుడు ఏడు దిల్ రాజుకు చెందినవే.14 రౌండ్లలో దిల్‌రాజుకు 563 ఓట్లు రాగా సి. కల్యాణ్‌కు 497 ఓట్లు వచ్చాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానెల్ సభ్యులు గెలుపొందారు
దేశానికి సైనికులు ఎలాగో సమాజానికి డాక్టర్లు అలా సేవచేస్తున్నారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని లయన్స క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అభయ బంజారా 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారని అన్నారు.
డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఒక మగ ప్రయాణీకుడు ఒక మహిళ మరియు ఆమె టీనేజ్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో విమానయాన సంస్దపై $2 మిలియన్ల దావా వేయబడింది. ఈ వ్యాజ్యం విమానయాన సంస్థ తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడిందని ఆరోపించడమే కాకుండా బాధితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని అభ్యర్థించింది.