Home / తప్పక చదవాలి
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనితో టిడిపి కార్యకర్తలు ఆందోళనకి దిగే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఆదివారం బహిరంగ మార్కెట్‌పై డ్రోన్ దాడిలో కనీసం 30 మంది మృతిచెందారు. గత కొద్దికాలంగా దేశంపై నియంత్రణ కోసం సైన్యం మరియు శక్తివంతమైన పారామిలిటరీ బృందం రెండూ పోరాటానికి దిగాయి. అయితే ఈ డ్రోన్ దాడి ఎవరివల్ల జరిగిందనేది తెలియలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు తిరిగి మద్దతివ్వడం పద్ధతని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్దాయిలో మండిపడ్డారు.
: మొరాకోలో సంభవించిన ఘోరమైన భూకంపం లో మృతుల సంఖ్య 2,000 దాటిందని అధికారులు తెలిపారు, బాధితులు ఇప్పటికీ చిక్కుకున్నారని భయపడుతున్న మారుమూల పర్వత గ్రామాలకు చేరుకోవడానికి దళాలు చేరుకుంటున్నాయి.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రిమాండ్ లో ఉంటారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు న్యూఢిల్లీలో ద్రౌపది ముర్ము నిర్వహించిన G20 డిన్నర్ నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. సదస్సు వేదిక అయిన భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు దేశాధినేతలు మరియు భారత ప్రభుత్వం ఆహ్వానించిన వారితో సహా దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు G20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన -- ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.ప్రపంచంలో శాంతి నెలకొనాలి అని స్థూలంగా అనువదించే ఈ నినాదం, G20 డిక్లరేషన్ శనివారం ఆమోదించబడిన నేపథ్యంలో ఇవ్వబడింది.
G20 సదస్సు సందర్బంగా గ్రూప్ సభ్యుల నందరినీ ఉమ్మడి ఏకాభిప్రాయానికి ఒప్పించిన భారతదేశం శక్తిని చూసి ప్రపంచం దాదాపు ఆశ్చర్యపోయింది.షెర్పా అమితాబ్ కాంత్ బృందంలో భాగమైన నలుగురు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ దౌత్యవేత్తలు నెలల తరబడి కష్టపడి చేసిన పని ఫలితంగా ఈ ప్రకటన వచ్చింది.
: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలోకి చేరేందుకు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సిద్ధమయ్యాడు. ఈ నెల 12వ తేదీన చికోటి ప్రవీణ్ బీజేపీ కండువా కన్నుకోనున్నాడు. . రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరనున్నారు.
పోలీసు సెక్యూరిటీ నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల యంత్రాంగం దగ్గరుండి కార్యాలయానికి చేర్చారు. దారంతా జనసైనికులు రక్షణ వలయంగా వెంట సాగారు. మంగళగిరికి వెళ్లాలని బయల్దేరిన జనసేనానిని జగ్గయ్యపేటలోని గరికపాడు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.