Home / తప్పక చదవాలి
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ హాజరుపర్చింది.. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు
రాష్ట్రపతి శనివారం ఏర్పాటు చేసిన జి20 విందు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మినహాయించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ నెల 21నుంచి తెలంగాణ బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేయనున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బస్సు యాత్రపై సమీక్ష నిర్వహించారు.
హోంగార్డు రవీందర్ మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తని డిపార్ట్మెంట్ వాళ్ళే తగులబెట్టారని సంధ్య ఆరోపించారు. ఘటనకి సంబంధించిన సిసి ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్‌ని అన్‌లాక్ చేసి డేటా డిలిట్ చేశారని అన్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి చెరో మూడు అసెంబ్లీ స్దానాలను గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ స్దానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ది ముందంజలో ఉన్నారు.
ఇండియా పేరును భారత్ గా మార్చుతారన్న వార్తల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చండి అని సవాలు చేశారు. , దేశం పేరు మార్చడానికి రాజ్యాంగాన్ని మారిస్తే ఎవరూ కేంద్రానికి మద్దతు ఇవ్వరని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు జనతాదళ్ (సెక్యులర్) మరియు బీజేపీల మధ్య పొత్తు విషయాన్ని జేడీ (ఎస్) వర్గాలు ధృవీకరించాయి. రాష్ట్రంలో పొత్తు పెట్టుకునేందుకు ఇరు పార్టీల అగ్రనేతల మధ్య కీలక భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పెద్దలు పాల్గొన్నారు.
రువాండాలో ఒక సీరియల్ కిల్లర్ తాను బార్లలో కలుసుకున్న మహిళలను హత్య చేసి, తన వంటగదిలో గొయ్యితీసి పాతిపెట్టినట్లు బయటపడింది. డెనిస్ కజుంగుగా గుర్తించబడిన 34 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసారు. బాధితులను వెంబడించే ముందు వారిని స్టడీ చేసినట్లు ఒప్పుకున్నాడు.
గత 140 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వర్షపాతం కురవడంతో హాంకాంగ్ జలమయమయింది. వీధులు, షాపింగ్ కేంద్రాలు మరియు మెట్రో స్టేషన్లు మునిగిపోయాయి. అధికారులు పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసారు.
మాలిలో గురువారం ఇస్లామిక్ తిరుగుబాటుదారులు చేసిన రెండు దాడుల్లో కనీసం 49 మంది పౌరులు మరియు 15 మంది ప్రభుత్వ సైనికులు మరణించారు. జుంటా ప్రకటన ప్రకారం, ఉగ్రవాదులు నైజర్ నదిపై టింబక్టు నగరానికి సమీపంలో ఉన్న ప్రయాణీకుల పడవను మరియు గావో ప్రాంతంలోని బాంబాలోని మాలి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.