Home / తప్పక చదవాలి
భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదాల నేపధ్యంలో కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. వీసా కన్సల్టెన్సీ సేవలను అందించే భారతదేశంలోని ఆన్లైన్ వీసా దరఖాస్తు కేంద్రం అయిన BLS ఇంటర్నేషనల్ నోటీసును దాని వెబ్సైట్లో పోస్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది.
ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. గ్రాడ్యుయేట్ మెడికల్ డాక్టర్లు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి విదేశాలలో వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొనసాగించవచ్చు. అంతేకాదు వారు అక్కడ ప్రాక్టీసు కూడా చేయవచ్చు
గురువారం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి ప్రజలను మరోసారి ఆశ్చర్యపరిచారు, అక్కడ ఆయన రైల్వే పోర్టర్లతో సమావేశమయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు పోర్టర్ దుస్తులు ధరించి లగేజ్ కూడా మోసారు.
లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటాను అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇది
వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన ఛానెల్స్ ఫీచర్ మంచి ఆదరణ పొందింది. నరేంద్ర మోదీ సెప్టెంబర్ 19న ఈ కొత్త వాట్సాప్ కమ్యూనిటీలో చేరారు, ఇది నిరంతర కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే ప్రయత్నంలో మరొక ముఖ్యమైన దశను సూచిస్తుంది. మోదీ ప్లాట్‌ఫారమ్‌పైకి ప్రవేశించిన ఒక రోజు వ్యవధిలో 1 మిలియన్ ఫాలోవర్లను దాటారు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మైనర్ బాలికకు చేదు అనుభవం ఎదురయింది. విమానంలో టాయిలెట్ సీటు వెనుక భాగంలో ఐఫోన్ అతికించి ఉండటంతో ఆమె షాక్ అయింది. బాలికను రికార్డ్ చేయడానికే ఫోన్ అక్కడ ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసి రిమాండులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు పెద్దగా స్పందించలేదు. అయితే తమిళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో తమిళ హీరో విశాల్ కూడా చేరారు.
జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఉక్రెయిన్‌కు 400 మిలియన్ యూరోల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. మేము రక్షణ వాహనాలు మరియు మందుపాతర తొలగింపు వ్యవస్థలకు సహాయం చేస్తాము. రాబోయే శీతాకాలం గురించి కూడా మేము జాగ్రత్త తీసుకున్నాము: మేము బట్టలు, విద్యుత్ మరియు వేడి జనరేటర్లను పంపుతాము. ప్యాకేజీ విలువ 400 మిలియన్ యూరోలు అని స్పష్టం చేసారు.
గతకొద్ది కాలంగా అంతర్యుద్దంతో సతమతమవుతున్న సూడాన్‌లోని తొమ్మిది శిబిరాల్లో గత ఐదు నెలల్లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1,200 మంది పిల్లలు మరణించారని యునైటెడ్ నేషన్స్ యొక్క శరణార్థి ఏజెన్సీ తెలిపింది. ఇవన్నీ మీజిల్స్ మరియు పోషకాహారలోపం కారణంగా జరిగాయని పేర్కొంది.