Home / తప్పక చదవాలి
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం కాలేజీ విద్యార్థిని నడుపుతున్న స్కూటీ వెనుక కూర్చుని కనిపించారు. జైపూర్‌లో ఒక రోజు పర్యటనలో రాహుల్ గాంధీ మహారాణి కళాశాలలో ప్రతిభావంతులైన బాలికలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు.
సోమాలియాలోని బెలెడ్‌వేన్ నగరంలోని భద్రతా తనిఖీ కేంద్రం వద్ద జరిగిన బాంబు దాడిలో కనీసం 18 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. చెక్‌పాయింట్ వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పేలడంతో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఇది ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదివారం ప్రారంభించారు.మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
తిరుమలలో గుర్తు తెలియని దుండగులు ఉచిత ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేశారు. తిరుమల గ్యారేజ్ నుండి చోరీ చేసి అందులోనే చక్కర్లు కొట్టారు. జిపిఆర్ఎస్ సిస్టం ద్వారాబస్సును గుర్తించిన పోలీసులు లోకేషన్ ద్వారా ట్రేస్ చేసి బస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
:జనసేన, టీడీపీ, బీజేపీ రాజ్యాధికారం చేపట్టాలని కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. పెత్తనం సాగిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గద్దె దించాలని కోరారు. అన్నీ కులాలు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.పాలకొల్లు కాపు సంక్షేమ సేన విస్తృతస్దాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం చంద్రబాబును ప్రశ్నిస్తోంది.
తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు 8గంటల 30 నిమిషాలలో చేరుకోనుంది.
న్యూయార్క్ నగరంలోని నర్సరీలో పెద్ద పరిమాణంలో ఫెంటానిల్, ఇతర డ్రగ్స్ మరియు సామగ్రిని దాచి ఉంచినట్లు న్యూయార్క్ నగర పోలీసులు కనుగొన్నారు.న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ గోధుమ మరియు తెలుపు పౌడర్లతో నిండిన డజనుకు పైగా ప్లాస్టిక్ సంచుల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. అధికారికంగా ఎన్డీఏలో చేరారు. అమిత్ షా, కుమార స్వామి సమావేశంలో బీజేపీ ప్రెసిడెంట్ జెపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు.
వెనిజులా లోని ఒక జైలు నుంచి బిట్‌కాయిన్ మైనింగ్ మెషిన్లు,రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగిచింది. జైలును తమఆట స్థలంగా,ఒక కొలనుగా,నైట్ క్లబ్ గా మార్చేసిన ముఠానుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.