Last Updated:

Undavalli Sridevi office: గుంటూరులోని ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం నుంచి ప్రచార రధం పట్టుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు

గుంటూరులోని ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి‌ ఆఫీస్‌ లోని ప్రచార రధాన్ని తమదేనంటూ కార్యకర్తలు తీసుకు వెళ్ళారు.

Undavalli Sridevi office: గుంటూరులోని ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం నుంచి  ప్రచార రధం పట్టుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు

Undavalli Sridevi office: గుంటూరులోని ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి‌ ఆఫీస్‌ లోని ప్రచార రధాన్ని తమదేనంటూ కార్యకర్తలు తీసుకు వెళ్ళారు. ఎమ్మెల్యే వాడే ప్రచార రథం తన అక్క పేరుపై ఉందని సందీప్ అనే కార్యకర్త తెలిపారు. ఆరు లక్షలు పెట్టి ప్రచార రధం కొన్నాం. తరువాత బ్యాంకు బకాయిలు చెల్లించి వాహనం ఇవ్వమంటే శ్రీదేవి బయటకు గెంటించారని అన్నారు.

ఇన్నర్ తప్ప అన్నీ కార్యకర్తలు కొన్నవే..(Undavalli Sridevi office)

బర్త్‌డే వచ్చిందంటే బంగారం తీసుకు రండి, చీరలు తీసుకు రండంటూ ఒత్తిడి చేసేవారని సందీప్ అనే కార్యకర్త ఆరోపించారు. ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్‌లో ఉన్న ప్రతి వస్తువు, సీసీ కెమెరాలతో సహా కార్యకర్తలవే అని సందీప్ చెప్పారు. ప్రతి వస్తువు పద్దతిగా ఇస్తే తీసుకెళ్తాం, లేకుంటే బలవంతంగా తీసుకెళ్తామని సందీప్ హెచ్చరించారు. ఉండవల్లి శ్రీదేవి ఇన్నర్ తప్ప అన్ని వస్తువులు కార్యకర్తలతో కొనిపించింది.నేను ఎమ్మెల్యేకు 2,40,000/- పెట్టి ఫ్రిజ్ కొనిచ్చాను.దళిత కార్డు అడ్డంపెట్టుకుని దోపిడికి పాల్పడిందంటూ సందీప్ ఆరోపించారు.45 నుంచి 50 మంది కార్యకర్తలు కోటి రూపాయలదాకా నష్టపోయారని అన్నారు.

మూడు కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాను..

మేకలరవి అనే తన సోదరుని వద్ద కోటి నలభైలక్షల రూపాయలు అప్పు  తీసుకున్నారని దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సందీప్ చూపించారు. నువ్వు వస్తానంటున్నావు కదా కార్యకర్తల దగ్గర ఎంత దండుకుంటున్నావో చెబుతాం.. నిన్ను నిలదీస్తామని అన్నారు. అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులన్న శ్రీదేవి ఇపుడు వారిపై సానుభూతి చూపిస్తూ ఊసరవెల్లిలా మారిందన్నారు. తనకు మూడుకోట్ల రూపాయలు ఎమ్మెల్యే శ్రీదేవి ఇవ్వాలని చెప్పారు. తాము గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసామన్నారు. తన భర్తను గన్ మెన్లతో, ప్రైవేట్ వ్యక్తులతో కొట్టిస్తే అతను పారిపోయాడని తరువాత సజ్జల వద్దకు వచ్చి ఆమెకు మంత్రి పదవి ఇవ్వవద్దని చెప్పాడన్నారు. తనకు హైదరాబాద్ లో పలు స్దలాలు ఉన్నాయని బడాయి కబుర్లు చెప్పిన శ్రీదేవికి ఏమీ లేవన్నారు. ఆమెకు ఉన్నది గచ్చిబౌలి లోని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో చిన్న క్లినిక్ మాత్రమేనని అన్నారు. శ్రీదేవి భర్త ఓసీ అని అయితే వారి అమ్మాయి ఎస్సీ సర్టిఫికెట్ తో ఎంబీబీఎస్ చదువుతోందని ఆ విషయం సంగతి తరువాత చూస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి తాను డబ్బులు తీసుకున్నానని, పార్టీకి వ్యతిరేకంగా ఓటేశాననే ఆరోపణలను తాడేపల్లి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి కొట్టిపారేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: