Home / తెలంగాణ
వ్యవస్ధల్లో నూతన వరవడిని సృష్టించాలంటే భారత రాజ్యాంగంలో అనేక సంస్కరణలు, మార్పులు అవసరమంటూ అనేక మంది రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. వారందరికి బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చెక్ పెట్టారు
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసి శుభవార్త చెప్పింది. సాధారణ చార్జీలతో వారి వారి స్వస్ధలాలకు వెళ్లవచ్చని తీపి కబురు అందించింది.
తెలంగాణ పండుగల్లో ప్రజలు ఆరాధించుకొనే పండుగల్లో బతుకమ్మ ఉత్సవాలు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా బతుకమ్మ పండుగను చేపడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తుంటుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల కమీషన్ కు సర్వోత్తమ న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం భాగ్యనగరాన్ని కుదిపేస్తుంది. నగరంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం కేసీఆర్ అంటూ మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అధికార, విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తుంది.
బుడిబుడి అడుగుల ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన కొమురంభీం జిల్లా భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
సీఎం క్యాన్వాయా మజాకా. ఏ మార్గంలోనైనా సీఎం కాన్వాయ్ వస్తుంటే ఆ మార్గంలో పాదచారులకు, వాహనదారులకు తిప్పలు ఇక చెప్పనక్కర్లేదు. హైదరాబాదులోని ప్రధాన రహదారుల్లో అయితే ఇక ప్రజల పడే నరకం అంతా ఇంత కాదు. కాన్వాయ్ వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో వెళ్లిన కారణంగా ఓ మహిళ పై కేసు నమోదైన ఘటన తెలంగాణ విమోచన దినం నాడు చోటుచేసుకొనింది.
మద్యం మత్తులో స్విగ్గీ బాయ్ పై దాడికి దిగారు. పిడిగుద్దులతో చితకొట్టారు. వెంటపడి తరిమారు. చివరికి పోలీసుల చేతికి చిక్కిన ఆ ఘటన హైదరాబాదు చైతన్యపురి పిఎస్ పరిధిలో చోటుచేసుకొనింది