Home / తెలంగాణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులతో ఆటలాడుకొంటుంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో అడ్డదారులు దొక్కుతూ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తమ ప్లేయర్స్ కొట్టే షాట్ల కోసం గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చిన జగన్ ప్రభుత్వానికి షర్మిల చీవాట్లు పెట్టారు. తెలంగాణ పరిగి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న ఆమె ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతుంది బీజేపీ. ఇందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.
ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన రూ. 70 లక్షలకు పైగా విలువైన చరవాణీలను చోరీ చేశాడు.. కానీ అక్కడనున్న ల్యాప్టాప్లు కానీ మరే ఇతర వస్తువుల జోలికి కానీ అతడు వెళ్లకపోవడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది.
ఖమ్మం జిల్లాలో ఇటీవలె లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన విధితమే. కాగా ఆ హత్యపై పోలీసులు దర్యాప్తు చెయ్యగా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని వెల్లడయ్యింది. సొంత భార్యే అతన్ని హత్య చేయించిందని తేలింది.
పాతబస్తీలో అక్రమంగా నిల్వ చేసి ఉంచిన బాణా సంచా సామగ్రిని సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు సీజ్ చేసారు. చెలపురాలోని ఓ గోదాములో బాణా సంచాను అక్రమంగా నిల్వ చేసివున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు.
ఈడీ, బోడీ, ఎవరూ ఏమీ చేయలేరు. ఇది తెలంగాణ అంటూ తొడ కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్యూను సీరియస్గా టేకప్ చేసిన మోదీ సర్కారు. తామేమిటో చేతల్లో చూపించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది
మావోయిస్టు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న భార్య సావిత్రి పోలీసుల ముందు లొంగిపోయింది. ప్రస్తుతం సావిత్రి కిష్టాపురం ఏరియా కమిటీ సెక్రటరీగా ఉంది
ఇకపై తెలంగాణాలో ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ రానున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మందులను సత్వరంగా అందచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది.