Home / తెలంగాణ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళా పాత్రికేయులను సత్కరించారు.
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీగా వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు పిళ్లై పనిచేశాడని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులుప్రశ్నించగా తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిని అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకటర్రామిరెడ్డిలను పార్టీ నుంచి ప్రతిపాధించారు. ఈ నెల 9న వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
BRS MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు.
KTR Comments: హైదరాబాద్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలకు ఒకే దగ్గర అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
Narsingi: హైదరాబాద్ లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, దోపిడిలు, అత్యాచారలు నానాటికి పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన దారుణ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశ్నించడం కోసం అంటూ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది.
Nalgonda MLA: ఓ వైపు దేశవ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు రోజులపాటు ఈ పండగ జరగనుంది. వివిధ రంగులతో ప్రజలు పండగ చేసుకుంటుంటే.. ఓ చోట మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు.