Union Minister Rammohan Naidu : వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టుకు క్లియరెన్స్

Union Minister Rammohan Naidu : వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే ఓకే చెప్పింది. ఆదివారం హైదరాబాద్ కవాడిగూడలో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో విమానయానరంగంలో విప్లవాత్మమైన మార్పులు తెచ్చారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు క్లియరెన్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. వరంగల్ ఎయిర్పోర్టు ప్రజల చిరకాల వాంఛ అన్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు తన హయాంలో క్లియరెన్స్ రావడం ఎంతో సంతోషనిచ్చిందన్నారు. గతంలోనే వరంగల్లో ఎయిర్పోర్టు ఉండేదని, అది అసియాలోనే అతి పెద్దదని గుర్తుచేశారు.
150కి పెరిగిన ఎయిర్ పోర్టులు..
1981 వరకు వరంగల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు సాగాయని తెలిపారు. మోదీ ప్రధాని కాకముందు దేశంలో 79 మాత్రమే ఎయిర్ పోర్టులు ఉండేవని, ఇప్పుడు అవి 150కి పెరిగాయని చెప్పారు. చిన్న చిన్న నగరాల్లో ఎయిర్పోర్టులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. మామునూరు ఎయిర్పోర్టు క్లియరెన్స్ విషయంలో చాలా సమస్య తలెత్తాయని తెలిపారు. ఎయిర్ పోర్టుకు 2800 మీటర్ల రన్ వే కావాల్సి ఉంటుందని, ఇందుకోసం 280 ఎకరాలు అదనంగా భూసేరకరణ చేయాల్సి ఉంటుందని, కేంద్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.
గత ప్రభుత్వం సహకరించలేదు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని, అందుకే ఎయిర్ పోర్టు నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏన్ వోసీ కావాల్సి వచ్చిందని, ఇప్పుడు తీసుకుని మామూనూరు విమానాశ్రయానికి క్లియరెన్స్ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా భూమిని సేకరిస్తే వెంటనే పనులు ప్రారంభవుతాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టు కోసం స్థలం కావాలని ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు. గతంలో సూచించిన స్థలం ఫీజిబులిటీగా లేదని, మరోచోట స్థలం కావాలని ప్రతిపాదించినట్లుగా చెప్పారు. కొత్త స్థలం ఇస్తే ఫీజిబులిటీని పరిశీలిస్తామని తెలిపారు. రిపోర్టు సానుకూలంగా వస్తే భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.