Home / ప్రాంతీయం
Telangana Assembly Budget Sessions Begins From Today: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉదయం 11 గంటలకు తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. 14న హోలీ సెలవు కారణంగా అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అయితే మరోవైపు ఈ సభను గురువారానికి వాయిదా […]
CM Chandrababu Aggressive Speech In AP Assembly sessions: రాజకీయ కక్షలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తన జీవితంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కక్షలు ఉండవని స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని గుర్తు చేశారు. కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. నాగరిక సమాజంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, గత పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేకపోయారన్నారు. నాతో […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో చర్చ జరిగింది. అధికార పార్టీలకు, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా కొనసాగింది. అయితే ఉచిత ఇషుక విధానం తీసుకొచ్చినప్పటికీ పెద్దగా మార్పులు రాలేదని, గతంలో కంటే పెద్దగా ఏం చేశారని వైసీసీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు స్పందించారు. ఉచిత ఇసుక విధానం అమలులో నెలకొన్న సమస్యలను […]
New Uniform Of AP Govt School Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్‌లు మారనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన డ్రెస్సుల కలర్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందించనుంది. ఇందులో భాగంగానే, కొత్త యూనిఫామ్‌లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఏ […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల తర్వాత పలు అంశాలపై చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే రాజధాని భూసేకరణ అంశంపై మంత్రి నారాయణ మాట్లాడారు. 2015 జనవరి 1న భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, 2015 ఫిబ్రవరి 15లోగా భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఒక్క సమస్య కూడా లేకుండా 58 రోజుల్లోనే భూసేకరణ చేశామన్నారు. సీఎం చంద్రబాబుపై […]
BJP Leader Arvind with his New Bride: హైదరాబాద్‌లో బీజేపీ నేత చేసిన నిర్వాహం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్వాన్ నియోజకవర్గ గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురాజాల అరవింద్ కుమార్.. ఓ నవ వధువుతో పరారయ్యాడు. కాగా, ఆయనకు ఇప్పటికే వివాహం కావడంతో పాటు పాప కూడా ఉంది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత అరవింద్ కుమార్(46)కు లంగర్ హౌస్ పరిధిలోని గొల్లబస్తీలో ఉంటున్న ఓ యువతి గత కొంతకాలంగా పరిచయం […]
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో విజయసాయిరెడ్డిపై 506, 384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 12న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు […]
Posani Krishna Murali : ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేటలో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసారావుపేటలో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. మార్చి మొదటి వారంలో కృష్ణమురళిపై కేసు నమోదు కాగా, కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో ఆయన్ను హాజరు పర్చారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి పది రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో అతడిని నరసరావుపేట టూటౌన్ పోలీసులు గుంటూరు […]
Kurnool High Court : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ వాసుల కలను నెరవేర్చేందుకు 2014-19లో టీడీపీ అడుగులు వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం స్థానిక ప్రాంతాలను పరిశీలించింది. కానీ, ఎన్నికలు రావడంతో టీడీపీ ఓటమి చవిచూసింది. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కర్నూలును మూడో రాజధాని చేస్తామని ప్రకటించింది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని హామీని కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాంతాన్ని […]
MandaKrishna Madiga : రాష్ట్రంలో నేటి నుంచి వివిధ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేస్తుంది. తాజాగా ఇవాళ గ్రూప్-1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేసింది. రేపు గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకు కార్డులను విడుదల చేయనున్నది. ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకూ అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఇవాళ జరిగిన రిలే నిరాహార దీక్షలకు […]