Home / ప్రాంతీయం
పీఎల్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉప్పల్ హెచ్ సి ఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది .ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి .. ఆధ్వర్యంలో ధర్నాచేసారు.
తెలంగాణ లో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం మొదలు పెట్టిన యాదాద్రి ధర్మల్ విద్యుత్కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది .ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు విమర్శించడం గమనార్హం .దీని వలన లాభం కంటే నస్టమే ఎక్కువని అనవసరంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టు ప్రారంభించారని చెబుతోంది.
పతినే ప్రత్యక్ష దైవంగా భావించిన భార్య భర్త చనిపోయిన తర్వాత గుడి కట్టిన సంఘటన ఆసక్తిగా మారింది .మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ,సోమ్లాతండాకు చెందిన బానోతు హరిబాబు, కల్యాణి దంపతలు. వీరికి 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది . పిల్లలు కలగ లేదు.
ఏపీ సీఎం జగన్ కు తన చిన్నమ్మ ,వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు .ఇప్పటి వరుకు వివేకానంద రెడ్డి హత్య కు సంబంధించి అయన సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పటివరకు జగన్‌కు లేఖ రాయడం కానీ ,జగన్ ను విమర్శించడం గాని చేయలేదు . తొలిసారి గా సౌభాగ్యమ్మ లేఖ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది .
పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.
మేము ఓడితే నాకు కానీ చంద్ర బాబు కు ఏమి కాదు .కాని రైతులు,కార్మికులు ,విద్యార్థులు దెబ్బతింటారు .ఇది చూస్తూ నేను ఉరుకోలేను .అందుకే కూటమి కట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ-జనసేన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల లో జ్యూట్ మిల్లు ను తెరిపిస్తామని చెప్పారు..
కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయింది. ఈనెల 30, వచ్చేనెల మే 3, 4 తేదీల్లో మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు . ఈనెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగసభకి మోదీ హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో సభకి నరేంద్ర మోదీ హాజరవుతారు.
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్ లో ఉత్తీర్ణత శాతం 60.01 కాగా 12వ తరగతిలో 64.19 గాఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని సూచించింది