Home / ప్రాంతీయం
ప్రజా స్రవంతిలో ధరలు కట్టడి అనేది ఏ ప్రభుత్వానికైనా ఎంతో ముఖ్యం. దానిపై పాలక ప్రతిపక్షాల మద్య నిత్యం మాటలు యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాని నేడు ఆదిశగా ప్రభుత్వాల అడుగులు పడడం లేదు. కేవలం ప్రతిపక్షానికి మేము ఏం జవాబు చెప్పేది అన్న కోణంలో సాగుతున్నట్లుగా శాసనసభా సమావేశాల తీరు ఉందని ఏపి అసెంబ్లీ సమావేశాలు రుజువుచేస్తున్నాయి
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుడు రాజు తెలంగాణ తల్లి విగ్రహనికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్ధితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుంది. ఆయన తీసుకొనే నిర్ణయాలు సీనియర్లకు ఇష్టం లేని కారణంగా ప్రతి విషయాన్ని రాద్ధాంతం దిశగా వారు నడిపిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నెలలో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. విజయవాడలో జరగనున్నసిపీఎం జాతీయ మహాసభలో ఆయన పాల్గొననున్నారు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రాత్రి 10గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నఅమిత్ షా,రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు.
నిత్యం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యులు సైతం కలియుగ దైవాన్ని సందర్శించుకొని మరీ మొక్కులు చెల్లించుకొంటారు ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేశ్వర స్వామివారిని విఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొన్నారు.
దేశమంతా ఆధార్ నెంబరుకు ఓటరు కార్డు లింక్ చేసుకోవాలన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది
అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలంటే వందేళ్లైన పూర్తికాదని, కేవలం కలలో మాత్రమే ఊహించుకోవచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేసారు. అసెంబ్లీలో జగన్ పాలన వికేంద్రీకరణపై ప్రసంగించారు
భాగ్యనగర వాసులకు టిఎస్ ఆర్టీసి ఓ వరం లాంటిది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేర్చడమే ఆర్టీసి ప్రధమ కర్తవ్యం. మెట్రో, ప్రైవేటు వాహనాలతో పోటీ పడుతూ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు ఆర్టీసి సేవలు అందేలా చేస్తుంది
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.