TSRTC: కోకాపేట సెజ్ కు మెట్రో బస్ సేవలు
భాగ్యనగర వాసులకు టిఎస్ ఆర్టీసి ఓ వరం లాంటిది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేర్చడమే ఆర్టీసి ప్రధమ కర్తవ్యం. మెట్రో, ప్రైవేటు వాహనాలతో పోటీ పడుతూ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు ఆర్టీసి సేవలు అందేలా చేస్తుంది
Hyderabad: టిఎస్ ఆర్టీసి కోకాపేట సెజ్ వాసులకు ఓ శుభవార్తను అందించింది. దిల్ సుఖ్ నగర్ నుండి మెట్రో సేవలను ప్రారంభించిన్నట్లు ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. సమాచారం మేరకు జంట నగరాల్లో కొత్త మార్గాల్లో ఆర్టీసి సేవలందించేందుకు సిద్దమైంది.
156కె రూటులో ప్రయాణీకుల సౌకర్యార్ధం దిల్ సుఖ్ నగర్ నుండి కోఠి, నాంపల్లి, మెహదీపట్నం, లంగర్ హౌస్, బండ్ల గూడ, తారామతిపేట, నార్సింగ్ మీదుగా కోకాపేట వరకు నూతనంగా 4 మెట్రో బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ తెలిపారు. దిల్ సుఖ్ నగర్ లో ఉదయం 6 గంటలకు మొదటి బస్సు ప్రారంభం కాగ, చివరి బస్సు రాత్రి 8.40 నిమిషాలకు ఉంటుందన్నారు. అదే విధంగా కోకాపేటలో ఉదయం మొదటి బస్సు 7.25 గంటలకు ప్రారంభమౌతుందన్నారు. చివరి బస్సు రాత్రి 10.07 గంటలకు కోకాపేట నుండి ఆర్టీసి సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని కోరారు.
ఐటి ఉద్యోగులకు శుభవార్త.
దిల్ సుఖ్ నగర్ నుండి కోకాపేట్ సెజ్ వరకు బస్సులు ప్రారంభం.. #ITEmployees#TSRTCNewBusService pic.twitter.com/VO3Cj0Zpd7— Managing Director – TSRTC (@tsrtcmdoffice) September 14, 2022