Home / ప్రాంతీయం
Andhra CM Naidu Meets Union Minister Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 7న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం కలుసుకున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల రవాణా వ్యవస్థ మెరుగు […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్యోగులు కలిశారు. ఈ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగంలో కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు.
CM Revanth Reddy Distributes Appointment Letter: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన ఉద్యోగుల సభలో మాట్లాడారు. కొత్తగా 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించారన్నారు. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గెలిపించారన్నారు. ఉద్యోగుల కళ్లల్లో సంతోషం […]
Kishan Reddy inaugurated Secunderabad To Goa Train: సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్ 10వ ఫ్లాట్ ఫారంపై జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుండగా.. ప్రతి గురువారం, శుక్రవారం వాస్కోడిగామా నుంచి బయలుదేరనుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు చేరుకునేందుకు ఈ రైలు కేవలం 20 గంటల సమయం మాత్రమే తీసుకుంటుందని రైల్వే శాఖ […]
Deputy CM Bhatti Vikramarka Announcement Residential school: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు కనీసం భవనాలు కూడా లేవన్నారు. అందుకే ఉచితంగా నాణ్యమైన విద్య కోసం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను కట్టాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా తొలుత 20 నుంచి 25 […]
AP Deputy CM Pawan Kalyan tweet about mgr: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 17తో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ స్థాపించిన ‘ఏఐఏడీఎంకే’ పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఎంజీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పురచ్చి తలైవర్’ ఎంజీఆర్‌పై […]
Heavy Rains in telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం వద్ద సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఏపీ తీరానికి దగ్గరగా కొనసాగుతోంది. ఈ […]
TTD Cancels Reverse Tendering System: టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసింది. ఈ మేరకు గత ఐదేళ్ల నుంచి అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈఓ శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం […]
Full powers to Hydra: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో తాజాగా, తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. దీంతో హైడ్రాకు చట్టబద్ధత వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే […]
Rajendra Prasads daughter passes away: టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చినట్లు తెలిసిందే. […]