Home / ప్రాంతీయం
Deputy Chief Minister Pawan Kalyan launches Palle Panduga: పల్లెలు స్వయం పాలన, ప్రగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుడగు వేస్తుందని జాతిపిత మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు.. గ్రామ స్వరాజ్య లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయ్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పల్లెకు పట్టం గట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ దీనికి కర్త, కర్మ కావడం విశేషం. […]
CM Chandrababu Naidu: ఈ నెల 16 నుంచి అనుమతులున్న రీచ్‌లు అన్నింటిలోనూ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే కాకుండా, నేరుగా రీచ్‌కి వెళ్లి తీసుకొనేందుకు అవకాశం కల్పంచాలన్నారు. సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి గనులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఇసుక అత్యవసరమైన వాళ్లు నేరుగా రీచ్‌కి వచ్చి, నగదు చెల్లించి ఇసుకను తీసుకెళ్లే అవకాశం […]
Samsung Galaxy A16 5G: టెక్ బ్రాండ్ సామ్సంగ్ తన కొత్త గెలాక్సీ A16 5Gని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల కంపెనీ గ్లోబల్ సైట్లో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 5Gకి సక్సెసర్‌గా మార్కెట్లో సందడి చేయనుంది. దీని ముందు వేరియంట్‌తో పోలిస్తే కంపెనీ దీనికి పెద్ద స్క్రీన్, బ్యాటరీ, అనేక ఇతర గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ప్రధాన ఫీచర్లు, కలర్ వేరియంట్లలో రానుంది. […]
Former Bapatla MP Nandigam Suresh illness: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. భుజంతో పాటు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ షుగర్, బీపీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. ఇందులో భాగంగానే బీపీ, ఛాతిలో నొప్పి వస్తున్నట్లు జిల్లా జైలు అధికారులకు తెలపగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ […]
Deputy CM Pawan Kalyan Mourns the Death of Ratan Tata: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా(86) అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రతన్ టాటా సేవలను కొనియాడారు. రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి […]
CM Revanth Reddy Speech At DSC Teachers Appointments: తెలంగాణ రాష్ట్ర పున: నిర్మాణంలో టీచర్ల పాత్రే కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రస్తుతం మిమ్మల్ని చూస్తే దసరా పండుగ ఇప్పుడే వచ్చినట్లు చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కొరివిదెయ్యం పాలించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులు […]
TCS to set up IT facility in AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు. లులు, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ […]
Asaduddin Owaisi slams Congress for blaming EVMs: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల తలకిందుకు కాషాయం పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. తొలుత గాలి హస్తం వైపు వీచిన ఆ తర్వాత బీజేపీ ముందంజలో నిలిచి కాంగ్రెస్ పై విజయం సాధించింది. దీంతో హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. అటూ […]
Pawan Kalyan visits Kanaka Durga temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆద్య కొణిదెలతో కలిసి సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఆయనతోపాటు హోం మంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Patnam Narender Reddy Arrest: తెలంగాణలో ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దుద్యాల మండలానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలతో కలిసి పాదయాత్ర చేసేందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా.. మార్గమధ్యలో బొమ్మరాసపేటలోని తుంకిమెట్ల వద్ద పోలీసులు ఆయనను అడ్డగించారు. అనంతరం నరేందర్ రెడ్డితోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ […]