Minister Tummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. పాలమూరు సభ ద్వారా రూ.3వేల కోట్ల రుణమాఫీ!

Minister Tummala Nageswara Rao Clarity On Rythu runamaffi: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాఫీ కాలేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికీ రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ.3 వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. షాద్ నగర్ మార్కెట్‌లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారు. కొందుర్గు మండలానికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Deputy CM Bhatti Vikramarka: ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదు.. మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం పార్టీదే