Home / ప్రాంతీయం
Gopi Murthy won in Teacher MLC elections: ఏపీలోని కాకినాడ జేఎన్డీయూలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈ బైఎలక్షన్లో యూటీఎఫ్ అభ్యర్ధి గోపీ మూర్తి విజయం సాధించారు. ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలో ఐదుగురు అభ్యర్థులు నిల్చున్నారు. ఇందులో గంధం నారాయణరావు, దీపక్ పులుగు, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంటకలక్ష్మి, బొర్రా గోపీమూర్తి ఉన్నారు. ఈ […]
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 9 తెలంగాణ పర్వదినం అని పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షను ఆనాడు కేంద్ర హోం శాఖ చిదంబరం ముందుకు తీసుకెళ్లారు. అలాగే సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారో.. ఆ ఆకాంక్షను నెరవేరడానికి డిసెంబర్ […]
BRS MLAs and MLCs Protest at Telangana Assembly Gate: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతకర టీషర్టులు ధరించి అసెంబ్లీ లోపలికి వచ్చేందుకు యత్నించారు. దీంతో అసెంబ్లీ దగ్గర సిబ్బంది బీఆర్ఎస్ నేతలను అడ్డుకొని అనుమతించడం లేదు. అయితే బీఆర్ఎస్ నేతలు అదానీ, రేవంత్ బొమ్మలతో టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఇందులో రేవంత్, అదానీ దోస్తానా అంటూ టీషర్టులు ఉండడంతో […]
A Boy Murdered inter student Pour petrol in Nandyal: నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందికొట్కూరులో ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి ఓ బాలుడు నిప్పంటించాడు. అనంతరం బాలుడు కూడా నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానంటూ ఓ బాలుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ తరుణంలో ప్రేమించడం లేదని ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలంలోని కలగొట్లకు […]
Sandhya Theatre Incident: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 5ను అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజైంది. దానికి ముందు రోజు డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయడంతో సినిమా చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో థియేటర్ హీరో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ […]
Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేటికీ ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లోనే ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంటుపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు […]
Heavy rain forecast for AP Storm in the Bay of Bengal: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12వ తేదీలోపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని […]
Former Minister Mekathoti Sucharitha Big shock to YSRCP: వైసీపీకి మరో షాక్. ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, వైసీపీ సీనియర్ నేత మేకతోటి సుచరిత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి, జనసేనలోకి చేరగా, ఆ పొరుగు జిల్లాకు చెందిన నేత సుచరిత నేడో, రేపో ఆ పార్టీకి వీడ్కోలు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. విధేయ నేతగా గుర్తింపు.. […]
Road Accident In Palnadu District 4 Killed: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి ఎదురుగా చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ […]
BRS Releases Charge Sheet on Congress One Year Rule: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ అంటూ మొత్తం 18 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి దక్కిందని […]