Home / ప్రాంతీయం
Telangana Assembly Sessions Schedule Released: తెలంగాణ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పాలక పక్షం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రజాపాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. చర్చకు రానున్న కీలక బిల్లులు రాబోయే […]
Patnam Narender Reddy Wife Petition in TG High Court: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు జరిగిందని గురువారం పట్నం శృతి హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనలు పాటించలే.. ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని పిటిషనర్ శృతి […]
Janasena MLA Anjaneyulu As PAC Chairman: ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ (పీఏసీ)గా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేటి ఎన్నిక సమయానికి తగినంత బలం లేకున్న బరిలో నిలిచిన వైసీపీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే, అసెంబ్లీ కమిటీహాల్లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇదీ లెక్క పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే […]
MLC Kavitha Reacts On Adani Issue: సుదీర్ఘ మౌనం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కె. కవిత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గురువారం అదానీకి న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయటంపై ఆమె ‘ఎక్స్’లో స్పందించారు. ధర్మానికి ప్రతీకగా తనను తాను భావించుకునే మోదీ పాలనలో ఆడబిడ్డకు, ప్రధాని మిత్రుడికి వేర్వేరు న్యాయాలుంటాయా? అని ఆమె నిలదీశారు. చాలారోజుల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయపరమైన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభత్వాన్ని […]
President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై, తొలి కార్తీక దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథునికి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]
AP DCM Pawan Kalyan Gift to Sai Durga Tej: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌కు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన కానుక ఫోటోను షేర్ చేస్తూ దాని ప్రత్యేకత ఏంటో వివరించాడు. కాగా సాయి దుర్గా తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన […]
TTD Chairman BR Naidu meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా, ఇటీవల టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా […]
TGSRTC decreases ticket price on special buses: పెళ్లిళ్లు, టూర్ల ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.పెళ్లిళ్ల సీజన్లో శుభకార్యాలకు, హాలీ డేస్ టూర్ల కోసం వెళ్లాలనుకునే వారి కోసం అద్దెకు తీసుకునే బస్సులపై టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలను తగ్గించింది. ఈ మేరకు అన్ని రకాల సర్వీస్‌లపై ఛార్జీలు తగ్గించినట్లు యాజమాన్యం ప్రకటించింది. పెళ్లిళ్ల సీజన్ రావడంతో ప్రజల నుంచి డిమాండ్ దృష్ట్యా ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని […]
KTR tweet about adani: అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. కేంద్ర ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదానీపై యూఎస్ అభియోగాలు నమోదు కాగా.. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారంతో నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. మూసీలో అదానీ వాటా ఎంత..? […]
IT Minister Nara Lokesh says 5 lakh jobs: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఐటీ అభివృద్ధి విషయంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయకత్వంలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. కానీ అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలనే ఉద్ధేశంతో […]