Home / ప్రాంతీయం
ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రతిపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆంజనేయులు 2011 నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. అయితే పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ తనకు గుర్తింపు దక్కడం లేదని.. ఏదైనా సాయం కోరితే వారిని కలవండి, వీరిని కలవండి అని చెబుతున్నారని.. పార్టీలో ఎస్సీలంటే ఎందుకు అంత చిన్న
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని ప్రారంభించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ఫామ్‌హౌస్‌లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగానికి అంకురార్పణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి చిత్రపటాలకు సీఎం జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అందరూ ఊహించినట్లుగానే బీజేపీ నేత,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ బిజెపికి షాకిచ్చారు. వివేక్‌తోపాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై విడుదలై ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కాగా ఉండవల్లి నివాసం నుండి ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుతుంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ మంగళవారం హూజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.ప్రజలు మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్టీల చరిత్ర, వైఖరిపై చర్చ జరగాలని అన్నారు.