Last Updated:

Smita Sabharwal: అర్థరాత్రి ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్

Smita Sabharwal: అర్థరాత్రి ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్

Smita Sabharwal: తెలంగాణ గవర్నెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్(Smita Sabharwal) చేసిన ట్వీట్.. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలంగా మారింది.

హైదరాబాద్ లోని ఆమె ఇంటికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న స్మితా సబర్వాల్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది.

మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్(Deputy Tahsildar)చొరబడటం తీవ్ర కలకలం రేపింది.

ఉద్యోగం విషయం మాట్లాడేందుకు అంటూ ఇంట్లోకి ప్రవేశించిన అతడిని చూసి ఆమె గట్టిగా కేకలు వేయడం.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకోవడం..

అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం లాంటి పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి.

మరోవైపు తనకు ఎదురైన పరిస్థితిని స్మితా సబర్వాల్ ట్వీటర్ ద్వారా పంచుకున్నారు.

‘నా జీవితంలో అత్యంత భయానక ఘటన జరిగింది. ఓ వ్యక్తి మా ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో నేను చాలా జాగత్ర్తగా వ్యవహరించాను. నా ప్రాణాలను కాపాడుకున్నాను.

ఇంట్లో మీరు ఎంత భద్రంగా ఉన్నారనుకున్నా సరే.. తలుపులకు తాళాలు వేసారో లేదో చెక్ చేసుకోవాలి. అత్యవసరమైతే 100 నెంబరు కు కాల్ చేయండి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.

అసలేం జరిగిదంటే..

విశ్వసనీయ సమాచారం మేరకు.. సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్(Smita Sabharwal) చురుగ్గా ఉంటారు.

అయితే ఆమె చేసే ట్వీట్లకు మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి(48) ఒకట్రెండు సార్లు రీట్వీట్లు చేశాడు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు.

తాను ఫలానా క్వార్టర్కు వెళ్లాలని ఎంట్రీలోని సెక్యూరిటీ సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.

స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు.

ముందు ఉన్న స్లైడింగ్ డోర్ తెరుచుకొని లోపలికి వెళ్లి తలుపు తట్టాడు. డోర్ తెరిచిన స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు అంత రాత్రి ఎదురుగా గుర్తు తెలియని కనిపించడంతో నివ్వెరపోయారు.

తేరుకున్న ఆమె.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం.

గతంలో మీకు ట్వీట్ చేశానంటూ చెప్పిన డిప్యూటీ తహసీల్దార్.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పినట్టు తెలిసింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బయటికి వెళ్లాలని గట్టిగా కేకలు వేసినట్లు సమాచారం.

తన అనుమతి గుర్తు తెలియని వ్యక్తులకు లోపలకు ఎలా పంపారని ఆమె సెక్యూరిటీని ప్రశ్నించగా.. వారు అప్రమత్తమై అతడిని పట్టుకుని జుబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారును సీజ్ చేసి, డిప్యూటీ తహసీ ల్దార్ పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు తెలుస్తోంది.

AnandKumar reddy

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/