Last Updated:

Ratha Saptami: ఆదిత్యుడి నిజరూప దర్శనంతో తరించిన భక్తజనం.. వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి సప్త వాహనాలపై దర్శనమివ్వనున్నారు.

Ratha Saptami: ఆదిత్యుడి నిజరూప దర్శనంతో తరించిన భక్తజనం.. వైభవంగా రథసప్తమి వేడుకలు

Ratha saptami: తిరుమలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి సప్త వాహనాలపై దర్శనమివ్వనున్నారు.

తెల్లవారు  జామునే సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీదుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దర్శనం(Ratha Saptami) కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది టీటీడీ. అదే విధంగా అన్నప్రసాదాలు, పాలు , నీరు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మొదలైన సేవలు తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్రస్నానం,

కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయి.

Image

Image

అరసవల్లి లో వైభవంగా రథసప్తమి

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి(Ratha Saptami)వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

స్వామివారికి దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

అనంతరం తొలిపూజ లో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల వరకు స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్దయెత్తున ఆలయంలో బారులు తీరారు. ఆ సూర్య భగవానుడి నిజరూప దర్శనం కోసం భక్తులు శుక్రవారం రాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఆదిత్యుడి మూలవిరాట్‌కు శుక్రవారం అర్ధరాత్రి క్షీరాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విశేష పుష్పమాల అలంకరణసేవ నిర్వహిస్తారు. తర్వాత విశేష అర్చన, ద్వాదశ హారతి, మహా నివేదన నిర్వహిస్తారు.

కాగా, అరసవల్లిలో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ వీఐపీలో సేవలో మునిగిపోయి.. సామాన్య భక్తులను పట్టించుకోవబం లేదంటున్నారు.

రూ. 500 టికెట్ తీసుకున్న భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని భక్తులు తెలిపారు.

వీఐపీల దర్శనం కోసం క్యూలైన్లను గంటల కొద్ది నిలిపివేస్తున్నారని ఆలయ ఈఓపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Image

Image

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/