Home / తాజా వార్తలు
Janasena MLA Anjaneyulu As PAC Chairman: ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ (పీఏసీ)గా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేటి ఎన్నిక సమయానికి తగినంత బలం లేకున్న బరిలో నిలిచిన వైసీపీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే, అసెంబ్లీ కమిటీహాల్లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇదీ లెక్క పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే […]
AAP releases first list for Delhi assembly election 2025: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. మిగిలిన అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ప్రకటనకు ఆప్ సిద్దమైంది. ఈ క్రమంలో 11 మంది అభ్యర్థులు పేర్లను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటిస్తారని, ఢిల్లీ ప్రజలు తిరిగి తమకు అండగా నిలవబోతున్నారని కేజ్రీవాల్ ధీమా […]
MLC Kavitha Reacts On Adani Issue: సుదీర్ఘ మౌనం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కె. కవిత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గురువారం అదానీకి న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయటంపై ఆమె ‘ఎక్స్’లో స్పందించారు. ధర్మానికి ప్రతీకగా తనను తాను భావించుకునే మోదీ పాలనలో ఆడబిడ్డకు, ప్రధాని మిత్రుడికి వేర్వేరు న్యాయాలుంటాయా? అని ఆమె నిలదీశారు. చాలారోజుల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయపరమైన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభత్వాన్ని […]
President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై, తొలి కార్తీక దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథునికి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]
Border-Gavaskar Trophy series: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. కాగా, ఈసారి రోహిత్ శర్మ గైర్హాజరు నేపథ్యంలో ఆ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదని, బాధ్యతలను ప్రేమిస్తానని, కఠినమైన పని చేయడం చిన్నపటి నుంచి అలవాటు అని, కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవడం సమస్య కాదు అని, దీన్ని ఒక కొత్త […]
US Teacher Sex With Student: ఓ విద్యార్థితో టీచర్ శృంగారంలో పాల్గొనగా, ఆమెకు 30ఏళ్ల జైలుశిక్ష ఖరారైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మాజీ మహిళా టీచర్ టీనేజ్ విద్యార్థితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న కేసులో శిక్షను విధించారు. మెలిసా కర్టిస్ అనే (32) టీచర్‌కు థార్డ్ డిగ్రీ సెక్స్ అఫెన్స్ కింద శిక్ష వేశారు. శిక్ష పూర్తయిన తర్వాత ఆమెకు మరిన్ని ఆంక్షలు విధించారు. కేవలం తన పిల్లలు తప్ప మైనర్లకు దూరంగా పెట్టాలని […]
Sanjay Murthy as CAG Chief: భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి సంజయ్ మూర్తితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తొలి తెలుగు వ్యక్తి కాగ్ […]
Renu Desai Mother Died: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఆమె ఫోటో షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె తల్లి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నెటిజన్లు, ఆమె సన్నిహితులు ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ఈ మేరకు రేణు […]
Pushpa 2 Kissik Song Release Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో ట్రైలర్ రికార్టులు నెలకొల్పింది. ఇక సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప […]
Thandel Bujji Thalli Lyrical Song: యువ సామ్రాట్ నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. శ్రీకాకుళంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చై-సాయి పల్లవి జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. పైగా దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే రిలీజైన […]