Home / తాజా వార్తలు
లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు కుప్పకూలాయి. ఇండియాలో అత్యంత సంపన్నులు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు బిలియన్ల కొద్ది డాలర్ల సంపద కోల్పోయారు.
ఏపీలో ప్రభుత్వం మారనుండడంతో కీలక పైళ్ల పై రాబోయే ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది .తెలంగాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సీఐడీ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లుంది .
: బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందని రేవంత్ అన్నారు.
హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు పీక్కు తిన్న సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. సాత్విక్ అనే బాలుడిని అతి దారుణంగా కుక్కలు కొరికి చంపాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి సాధించిన టీడీపీ ఫుల్ జోష్లో ఉంది. అలాగే లోకసభ ఎన్నికల్లో టీడీపీ 16 సీట్లు సాధించింది. ప్రస్తుతం బాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఒడిషాలో నవీన్ పట్నాయక్ శకం ముగిసింది. గత 24 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఏకచత్రాధిపత్యం నడిపించిన బీజేపీ చీఫ్ నీవన్ పట్నాయక్ బుధవారం నాడు రాజీనామా పత్రాన్ని ఒడిషా గవర్నర్ రఘుబర్దాస్కు సమర్పించారు.
లోకసభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు దక్కించుకుంది. మెజారిటి మార్కు 272 కాగా బీజేపీకి 32 సీట్లు తగ్గాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడో సారి జూన్ 8న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ మొత్తం 292 సీట్లు సాధించింది.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ , పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇప్పటి వరుకు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన అధికారులు రాజీనామా లు చేసే పనిలో పడ్డారు .కొంత మంది సెలవలు పెడుతున్నారు .
ఇంతకాలం గ్లాస్ గుర్తు పై వివాదం నెలకొంది .2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయిలో విజయం సాధించలేదు .దింతో గాజు గ్లాస్ గుర్తు జనరల్ కేటగిరీ లో ఉంచింది ఎన్నికల సంఘం .
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.