Amaran OTT: ఓటీటీకి వచ్చేసిన అమరన్ చిత్రం – స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Amaran Now Streaming on OTT: లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అమరన్ ఓటీటీకి వచ్చేసింది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న థియేటర్లో రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. థియేట్రికల్ రన్‌లో వరల్డ్ వైడ్‌గా రూ. 330 కోట్టకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ ఏడాది కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలో అమరన్ ఒకటిగా నిలిచింది. థియేటర్‌లో భారీ విజయం సాధించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
డిసెంబర్ 5న ఈ సినిమా ఓటీటీకి తీసుకువస్తున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పినట్టుగానే అమరన్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్‌కి ఇచ్చేసింది. డిసెంబర్ 5న అర్థరాత్రి నుంచి అమరన్ నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అమరన్ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషన్‌లో ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు.
20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన మట్కా
అలాగే వరుణ్ తేజ్ మట్కా మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైం ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మట్కా మూవీ నిలిచింది. నవంబర్ 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా మొదటి వీక్‌లోనే థియేటర్ల నుంచి వెనుదిరిగింది. దీంతో మట్కా 20 రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 5 అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైంలో మట్కా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.