Last Updated:

CM Jagan: నాడు-నేడు స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు ఉండాలి.. సీఎం జగన్

నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్న ప్రతి స్కూలుకూ సీబీఎస్ఈ గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో విద్యారంగం పై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించారు.

CM Jagan: నాడు-నేడు స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు ఉండాలి.. సీఎం జగన్

Naadu Nedu Scheme: నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్న ప్రతి స్కూలుకూ సీబీఎస్ఈ గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో విద్యారంగం పై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2024-25 లో సీబీఎస్ఈ పరీక్షలు రాయనున్న విద్యార్దులను దృష్టిలో ఉంచుకుని బోధనలో ప్రత్యేకచర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా అధికారులు ఇప్పటివరకు 1,000 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చిందని తలిపారు.

స్కూళ్లలో ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ కావాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదపిల్లలకు మంచి విద్య అందించినపుడే వారు పేదరికం నుంచి బయటపడతారు. విద్యారంగంలో చేర్పడుతున్న మార్పుల విషయంలో రాజీ పడొద్దని, ఈ విషయంలో వెనకడుగు వేయవలసిన పరిస్దితి లేదన్నారు.

2018-19లో ప్రభుత్వ స్కూళ్లలో 37 లక్షలమంది విద్యార్దులు ఉంటే ప్రస్తుతం 42 లక్షలమంది ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాడు-నేడు కార్యక్రమం 15 వేల స్కూళ్లలో జరిగింది.

ఇవి కూడా చదవండి: