Last Updated:

Viral Video: ఇదేంది భయ్యా ఇది.. ఇది నేనేడా చూడలే.. 9 మంది పిల్ల‌ల‌తో సైకిల్ స‌వారీ

ఒక్క సైకిల్ పై మహా అంటే ఇద్దరు కూర్చోగలరు ఒకరు ముందు మరొకరు వెనుక కానీ ఒక సైకిల్ పై తొమ్మిది మంది కూర్చోవడం ఎక్కడైనా చూశారా లేదు కదా అయితే ఈ క్రింద వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.

Viral Video: ఇదేంది భయ్యా ఇది.. ఇది నేనేడా చూడలే.. 9 మంది పిల్ల‌ల‌తో సైకిల్ స‌వారీ

Viral Video: ఒక్క సైకిల్ పై మహా అంటే ఇద్దరు కూర్చోగలరు ఒకరు ముందు మరొకరు వెనుక కానీ ఒక సైకిల్ పై తొమ్మిది మంది కూర్చోవడం ఎక్కడైనా చూశారా లేదు కదా అయితే ఈ క్రింద వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. ప్రపంచ జ‌నాభా న‌వంబ‌ర్ 15 నాటికి 800 కోట్ల‌కు చేరింది. దీనితో నెట్టింట పెద్ద‌సంఖ్య‌లో వీడియోలు, పోస్టులు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పెరుగుతున్న జ‌నాభాకు సంకేతం అన్న‌ట్టు ఓ వ్య‌క్తి సైకిల్‌పై 9 మంది పిల్ల‌ల‌తో వెళుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

జైకీ యాద‌వ్ అనే ట్విట్ట‌ర్‌ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజ‌న్ల‌కు తెగ నచ్చేసిందనుకోండి. ఇదేంది భయ్యా ఇది ఇది నేనేడా చూడలే అంటూ తెగ వైరల్ చేస్తున్నారు ఈ వీడియోను. ఈ వీడియోలో ఓ వ్య‌క్తి సైకిల్‌పై తొమ్మిది మంది పిల్ల‌ల‌ను ఎక్కించుకుని వెళుతుండ‌టం క‌నిపించింది. ముగ్గురు పిల్ల‌లు సైకిల్‌ వెనుక కూర్చోగా, వారిపై ఒక‌రు కూర్చున్నారు. ఇక ఇద్ద‌రు పిల్ల‌లు ముందు భాగంలో కూర్చోగా మ‌రొక‌రు ఏకంగా వీల్ టాప్‌పై కూర్చున్నారు. సైకిల్ తొక్కుతున్న వ్య‌క్తి భుజాలపై మరో ఇద్ద‌రు పిల్ల‌ల‌ు కూర్చున్నారు. కాగా వీరందరినీ ఎక్కించుకుని ఎంచక్కా ఆ వ్యక్తి సైకిల్ పై షికారు చేశారు. ఈ క్లిప్‌ను చూసిన నెటిజ‌న్లు మిశ్రమ రీతిలో స్పందించారు. ఇంత మంది పిల్ల‌లా అని ఒకరు కామెంట్ రాయ‌గా, బాధ్య‌త‌గా మెల‌గండి వారిలో అవ‌గాహ‌న పెంచే బాధ్య‌త పాల‌కుల‌దేన‌ని మ‌రొకరు కామెంట్ రాసుకొచ్చారు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వ్యక్తి ఎవరు ఎక్కడి వారు అనే వివరాలు తెలియరాలేదు.

ఇదీ చదవండి: ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకుని వచ్చిన అబ్బాయిలు..

ఇవి కూడా చదవండి: