Last Updated:

Malavika Nair: శర్వాతో జతకట్టనున్న మాళవిక

Malavika Nair: శర్వాతో జతకట్టనున్న మాళవిక

Malavika Nair new movie With Tollywood hero Sharwanand: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’మూవీతో హిట్ అందుకున్న నటి.. మాళవిక నాయర్. వరుస సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌ గానే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’సినిమాలో ఉత్తరగా నటించి మెప్పించింది.

తాజాగా, ఈ అమ్మడు టాలీవుడ్ హీరో శర్వానంద్ సరసన నటించబోతున్నట్లు సమాచారం. ‘శర్వా 36’ పేరుతో రాబోతున్న ఈ మూవీనికి అభిలాష్ కంకర తెరకెక్కిస్తుండగా, ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.