Erra Cheera New Release Date: ‘ఎర్ర చీర’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది – ఏప్రిల్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

Erra Cheera News Release Date Fix: ఎట్టకేలకు ‘ఎర్ర చీర: ది బిగినింగ్’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం తాజాగా కొత్త రిలీజ్ డేట్‌తో వచ్చింది. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయా ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించారు. నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్వీని కీలక పాత్రలో నటించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో రూపొందింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
మొదట గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. కానీ అప్పటికే పుష్ప 2 వంటి భారీ చిత్రం రిలీజ్‌కు ఉండటంతో వాయిదా వేశారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నామని చెప్పింది. కానీ ఈ తేదీకి కూడా మూవీ రిలీజ్ చేయలేదు. విడుదలకు కొన్ని రోజులు ఉందనగా.. సాంకేతిక కారణాలు వల్ల ఎర్ర చీరను శివరాత్రి రిలీజ్ చేయలేకపోతున్నామని తెలిపింది. అయితే కొత్త డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఎర్ర చీర కొత్త రిలీజ్ డేట్ వస్తామని పేర్కొంది. ఈ క్రమంతో తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న ఎర్ర చీర: ది బిగినింగ్‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నట్టు వెల్లడిస్తూ తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎన్ వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్‌లో అనేమంది అఘోరాలతో శివుడిని అద్భుతంగా చూపించామన్నారు. ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చిందని, థియేటర్లలో ప్రతి ఒక్కరిని ఈ సీన్ ఆకట్టుకుంటుందన్నారు. ఎర్ర చీర కుటుంబంతో పాటు పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా అన్నారు. అనంతరం డైరెక్టర్ సుమన్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలోని 25 నిమిషాల ఆటు ఉండే గ్రాఫీక్స్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని, అవే ఈ సినిమా హైలెట్ అన్నారు. ఇప్పటికే వేసిన బిజినెస్ షోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా చూసిన డిస్ట్రీబ్యూటర్స్ అంతా మూవీ బాగుందంటూ ప్రశంసలు కురిపించారని చెప్పారు.